
కాకినాడ జిల్లాలోని పామాయిల్ తోటలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ పది రోజులు దాటినా లభించలేదు. దీంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసిన అధికారులు, వన్యమృగాల ఉనికిని గుర్తించేందుకు ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
పాప తప్పిపోయిన ప్రాంతంలో ఇనుప బోనును ఏర్పాటు చేసి, అందులో చిన్నారిని పోలిన రెండు బొమ్మలను ఉంచారు. ఆ బొమ్మల్లో మాంసం ముక్కలను పెట్టి, జంతువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాటి కదలికలను పసిగట్టేందుకు సమీపంలో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.చిన్నారిని ఏదైనా వన్యమృగం ఎత్తుకెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నప్పటికీ, దానికి సంబంధించిన ఆధారాలేవీ ఇప్పటివరకు లభించలేదు.
సుమారు 400 మందికి పైగా పోలీసు, అటవీ శాఖ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కూడా రంగంలోకి దిగింది.
థర్మల్ డ్రోన్లతో సైతం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.ఈ కేసులో మిస్టరీని మరింత పెంచుతూ, పాపతో పాటు అదృశ్యమైన పెంపుడు కుక్క జూన్ 13న మృతి చెందింది. జూన్ 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన ఈ కుక్క, అప్పటి నుంచి ఆహారం తీసుకోకుండా వింతగా ప్రవర్తించింది.
దీనికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. సుమారు 80 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇంటికి చేరిన ఈ కుక్క, వైరల్ ఇన్ఫెక్షన్ సోకి మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.జూన్ 6న