
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Long Range Electric Scooters: ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో ఎక్కువగా టూ వీలర్స్ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
టూ వీలర్స్ ఈవీ సెగ్మెంట్లో ప్రస్తుతం అన్ని పెద్ద కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ఛార్జింగ్ తో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ మెయింటైనెన్స్, అలాగే పర్యావరణానికి కూడా ఎంతో అనుకూలమైనవి.
ఎలక్ట్రిక్ వాహనాలలో ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కూడా జనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ టూవీలర్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సెగ్మెంట్లో చక్కటి డిమాండ్ ఉన్నటువంటి నాలుగు మోడల్స్ గురించి తెలుసుకుందాం.
హీరో విడా (Hero Vida V2): ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో హీరో మోటార్స్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటి. ఒకసారి పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 165 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే 'పోర్టబుల్ బ్యాటరీ' ఫీచర్, ఆఫీసు లేదా ఇంటి వద్ద సులభంగా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
యువతను ఆకట్టుకునేలా చక్కటి డిజైన్ కలిగి ఉన్నటువంటి ఈ స్కూటర్ ఒకసారి చార్జింగ్ చేస్తే 123 నుండి 159 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుంది. దీని విశాలమైన సీటు అదనపు స్టోరేజ్ సామర్థ్యం ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): ఆటోమొబైల్ రంగంలో అత్యంత పేరుకు సంపాదించుకున్న సంస్థ
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Long Range Electric Scooters: ఓ వైపు పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో వాహనదారులు ఎక్కువగా ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్లో ఎక్కువగా టూ వీలర్స్ కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. టూ వీలర్స్ ఈవీ సెగ్మెంట్లో ప్రస్తుతం అన్ని పెద్ద కంపెనీలు ఈ రంగంలో ప్రవేశించాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ఛార్జింగ్ తో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటాయి. . అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ మెయింటైనెన్స్, అలాగే పర్యావరణానికి కూడా ఎంతో అనుకూలమైనవి. ఎలక్ట్రిక్ వాహనాలలో ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కూడా జనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ టూవీలర్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సెగ్మెంట్లో చక్కటి డిమాండ్ ఉన్నటువంటి నాలుగు మోడల్స్ గురించి తెలుసుకుందాం.
హీరో విడా (Hero Vida V2): ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో హీరో మోటార్స్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటి. ఒకసారి పూర్తి ఛార్జింగ్‌పై సుమారు 165 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే 'పోర్టబుల్ బ్యాటరీ' ఫీచర్, ఆఫీసు లేదా ఇంటి వద్ద సులభంగా ఛార్జింగ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
యువతను ఆకట్టుకునేలా చక్కటి డిజైన్ కలిగి ఉన్నటువంటి ఈ స్కూటర్ ఒకసారి చార్జింగ్ చేస్తే 123 నుండి 159 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తుంది. దీని విశాలమైన సీటు అదనపు స్టోరేజ్ సామర్థ్యం ఇందులో ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube): ఆటోమొబైల్ రంగంలో అత్యంత పేరుకు సంపాదించుకున్న సంస్థ టీవీఎస్. ఈ ప్రముఖ సంస్థ నుంచి వచ్చిన ఐక్యూబ్ స్కూటర్ సిరీస్ దాని స్మార్ట్ ఫీచర్లు ప్రస్తుతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి దీని వేరియంట్లను బట్టి 94 నుండి 212 కిలోమీటర్ల వరకు రేంజ్ అందజేస్తున్నాయి, ఇది సుదూర ప్రయాణాలకు కూడా ఎంతో అనువైనదిగా చెప్పవచ్చు. .
బజాజ్ చేతక్ (Bajaj Chetak): క్లాసిక్ లుక్ మెటల్ బాడీతో వచ్చే ఈ స్కూటర్, మారుపేరు. ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా సౌకర్యంగా ఉంటుంది. సుమారు 113 కిలోమీటర్ల రేంజ్‌ను అందించే ఈ స్కూటర్, ప్రీమియం అనుభూతిని కోరుకునే వారికి మంచి ఎంపిక.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
సర్వీస్ నెట్వర్క్: కేవలం రేంజ్ మాత్రమే కాకుండా, మీ ప్రాంతంలో ఆ బ్రాండ్‌కు ఉన్న సర్వీస్ సెంటర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బ్యాటరీ వారంటీ: ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీనే చాలా ఖరీదైన భాగం. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీపై కంపెనీ ఇచ్చే వారంటీ కాలాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు: మీ ఇంటి వద్ద ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందో లేదో ముందే ప్లాన్ చేసుకోండి.
మీ బడ్జెట్ రూ. 1 లక్ష లోపు ఉంటే కొన్ని ఎంట్రీ లెవల్ వేరియంట్లు దొరుకుతాయి, కానీ కొంచెం అదనపు బడ్జెట్ కేటాయిస్తే మంచి రేంజ్ ఫీచర్లు ఉన్న స్కూటర్లను పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.