
మానకొండూర్: సర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య చిచ్చు పెడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లిలో మంగళవారం ఆయన భాజపా నాయకులు, ఆర్ఎంపీలతో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకుముందు బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ విదేశీ ముస్లిం చొరబాటుదారులను, మన దేశ ముస్లింలతో పోల్చి అవమానిస్తోందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఓటరు కార్డు పొందితే ఆ ఓట్లను తొలగించాలా వద్దా కాంగ్రెస్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మన దేశ ముస్లింలకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని సీఎం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ట్ర్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చిందన్నారు.
తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఖాయమన్నారు. ప్రస్తుతం కేంద్ర నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. మావోయిస్టు భావజాలంతో సమాజానికి తీవ్ర నష్టమని, ఇప్పటికే ఎంతో మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఇంకా ఆలోచన ఉన్న వారు భవిష్యత్తు కోసం మారాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హైదరాబాద్ మూసాపేటలో అగ్నిప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్లు ఈనెల 18న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఆందోళనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
దుర్గమ్మకు.. సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను బహూకరించారు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన