
ఎక్కువగా మొబైల్‌తో గడిపేవారికి ఇన్అటెన్షన్ బ్లైండ్నెస్ (అశ్రద్ధ అంధత్వం) తలెత్తుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరు ఒక నిర్దిష్ట పనిపై దృష్టిపెట్టలేకపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లోని రోడ్డుభద్రతా స్వచ్ఛంద సంస్థ బ్రేక్ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైంది.
మామూలుగా మనం వాహనాలు నడుపుతున్నప్పుడో, రోడ్డు దాటుతున్నప్పుడో మెదడు అసంకల్పితంగానే కొన్ని సంకేతాలనిచ్చి మనల్ని సురక్షితంగా గమ్యం చేరేందుకు దోహదపడుతుంది. మొబైల్ ఊబిలో కూరుకుపోయిన వారి మెదడు ఆ శక్తిని కోల్పోతుందని అధ్యయనంలో తేలింది.
మొబైల్ మాయలో.. ముందు చూపు మాయం
|