
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాద ఘటన (US Beach tragedy) చోటుచేసుకుంది. సముద్ర అందాలను ఆస్వాదించేందుకు వెళ్లిన ఇద్దరు యువతులు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. బీచ్‌లో కునుకు తీస్తున్న సమయంలో ప్రమాదకర అలల తీవ్రతకు కొట్టుకుపోయారు.
వారం రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా.. స్థానిక పోలీసులు బాధితుల వివరాలు తాజాగా వెల్లడించారు. శాంటా క్రూజ్ కౌంటీలోని బోనీ డూన్ బీచ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే, అక్కడ ప్రమాదకర అలలు వస్తుంటాయి. ఫ్రీమౌంట్కు చెందిన హర్షిత నాయర్ (21), మహియాల్ శ్రాన్ (20)లు స్నేహితులు.
భారత సంతతికి చెందిన వీరిద్దరూ ఇటీవల ఆ బీచ్‌ను సందర్శించారు. ఓ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటుండగా ప్రమాదకర అలలు దూసుకురావడంతో ఇద్దరూ కొట్టుకుపోయారు. నేను లేకుంటే ఇజ్రాయెల్ ఉండేది కాదు - ట్రంప్ దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
బాధితులను రక్షించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే, హర్షిత అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించగా.. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత శ్రాన్ ప్రాణాలు విడిచారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.