
పోషకాలు పోకుండా ఉండాలంటే.. కొన్ని రకాల కూరగాయలు వండే విషయంలో.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేమిటో చూడండి మరి..! బంగాళాదుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించకూడదు. అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి.
అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి మధ్యలో చిన్నగా కోసి పొట్టుతో ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోదు. ఇతర పోషకాలూ అందుతాయని చెబుతున్నారు నిపుణులు. చాలామంది క్యాబేజీని ఉడికించి కూర చేస్తారు. ఇలా ఉడికించినప్పుడు అందులో శరీరానికి మేలు చేసే కొన్ని పోషకాలు వృథాగా పోతాయి.
అందుకే క్యాబేజీని తక్కువ నీటితో తక్కువ సమయం ఉడికించడం వల్ల పోషకాలు పోవు అంటున్నారు నిపుణులు. అలాగే క్యాబేజీని అతిగా ఉడికించినా, వేయించినా సల్ఫర్ విడుదలై దాని రుచి మారే అవకాశముంటుందట. సలాడ్లు, బర్గర్లు, శాండ్విచ్ వంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటాం.
నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్ ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. కాబట్టి వాటిని వేయించకపోవడమే మంచిదట. వీటిని ఎక్కువ మంట మీద ఉడికిస్తే అందులో ఉండే మాంసకృత్తులు నశించిపోతాయి. ఆరోగ్యానికి హాని చేసే కార్సినోజెనిక్ కాంపౌండ్లు, హెటరో సైక్లిక్ అమైన్స్ విడుదలవుతాయంటున్నారు నిపుణులు.
అందుకే తక్కువ మంట మీద ఉడికించడం మేలని సూచిస్తున్నారు నిపుణులు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.