
వయసు పైబడుతోందని చెప్పడానికి కనిపించే లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది- చర్మం ముడతలు పడటం. అందులోనూ ముఖం మీది చర్మం బాగా సున్నితంగా ఉంటుంది కాబట్టి ముడతల ప్రభావం ఎక్కువగా ముఖం మీదే కనిపిస్తుంది. వయసు పైబడుతోందని చెప్పడానికి కనిపించే లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది- చర్మం ముడతలు పడటం.
అందులోనూ ముఖం మీది చర్మం బాగా సున్నితంగా ఉంటుంది కాబట్టి ముడతల ప్రభావం ఎక్కువగా ముఖం మీదే కనిపిస్తుంది. అయితే చర్మంపై ముడతలు రావడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు.. సౌందర్య సంరక్షణలోను, మన జీవన విధానంలోనూ చేసే కొన్ని పొరపాట్లు కూడా అందుకు కారణమవుతాయంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలో అవేంటో తెలుసుకుందాం రండి... బయట ఎండలో తిరిగేటప్పుడు చర్మం సూర్యరశ్మి వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చిన్న వయసులోనే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించడానికి కూడా ఇది కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వంటి రక్షణ చర్యలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు.
మేకప్ వేసుకున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చాక దానిని తొలగించుకుని ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మేకప్ ఉత్పత్తుల్లో ఉండే ఫ్రీ రాడికల్స్, కాలుష్య కారకాలు.. ఇవన్నీ చర్మం మీద ప్రభావం చూపించి ముడతలు పడేలా చేస్తాయంటున్నారు.
కాబట్టి మేకప్‌తో నిద్రకు ఉపక్రమించడం అనేది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. చర్మంపై ముడతలు రావడానికి మన శరీర బరువులో వచ్చే మార్పులు కూడా కారణం కావచ్చు. ఒకేసారి బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరిగితే స్ట్రెచ్‌మార్క్స్ రావడంతో పాటు చర్మం సాగినట్లుగా..
ముడతల్లా కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరలు మన ఆహారంలో భాగం కావాలి. ఎందుకంటే అవి చర్మంపై బాగా ప్రభావం చూపిస్తాయి. వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేయడంలో సహకరిస్తాయి.
అందవో.. అప్పుడు ఆ ప్రభావం తప్పకుండా చర్మం మీద కనిపిస్తుందంటున్నారు నిపుణులు.
ఉన్నచోటే అదే పనిగా కూర్చుని ఉంటే శరీరానికి వ్యాయామం అందక ఆ ప్రభావం చర్మంపై కూడా కనిపించే అవకాశం ఉంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
ఎప్పుడైతే చర్మ సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు