
పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ అంటే ఇప్పటికీ ఎంతోమందికి ఇష్టం. ఆయన తర్వాత ఎంతమంది డ్యాన్సర్లు వచ్చినా.. మైఖేల్ జాక్సన్ స్టెప్పులను అనుకరించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ క్రమంలోనే కోమల్ ఆద్య అనే అమ్మాయి.. జాక్సన్ ఐకానిక్ హిట్ ‘బిల్లీ జీన్’ సాంగ్‌కి స్టెప్పులేసింది.
పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ అంటే ఇప్పటికీ ఎంతోమందికి ఇష్టం. ఆయన తర్వాత ఎంతమంది డ్యాన్సర్లు వచ్చినా.. మైఖేల్ జాక్సన్ స్టెప్పులను అనుకరించేవారు ఇప్పటికీ ఉన్నారు. ఈ క్రమంలోనే కోమల్ ఆద్య అనే అమ్మాయి.. జాక్సన్ ఐకానిక్ హిట్ ‘బిల్లీ జీన్’ సాంగ్‌కి స్టెప్పులేసింది.
అది కూడా సంప్రదాయ చీరకట్టులో. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. సుమారు 20 లక్షల వీక్షణలతో దూసుకుపోతోంది. బిహార్‌కు చెందిన కోమల్ ఆద్యకు.. చిన్నప్పటి నుంచీ డ్యాన్స్ అంటే మక్కువ. శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ తీసుకుంది.
ఈ క్రమంలోనే తన డ్యాన్స్ వీడియోలతో పాటు వివిధ ఆసక్తికరమైన అంశాలను రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అలా రీల్ క్రియేటర్‌గా మారింది. చీరకట్టులో కూడా డ్యాన్స్ చేస్తూ.. ఆద్య తన అభిమానులను అలరిస్తుంటుంది. మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘మైఖేల్’ చిత్రం ఈ ఏడాదే విడుదలైంది.
ఒకవేళ తన తల్లి ఈ చిత్రం చూసి ఒక్కసారిగా జాక్సన్‌లా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన ఆద్యకు వచ్చింది. అలా ఇటీవలే మైఖేల్ జాక్సన్ ఆల్ టైమ్ హిట్ ‘బిల్లీ జీన్’ సాంగ్‌కు తల్లిలాగా చీరకట్టులో స్టెప్పులు వేసింది. ఇందులో భాగంగా సంప్రదాయ చీరకట్టులో కూడా వెస్ట్రన్ స్టెప్పులను కచ్చితత్వంతో వేయడం విశేషం.
ఈ వీడియోలో మైఖేల్ జాక్సన్ క్లాసిక్ స్టెప్పులు, రోబోటిక్ పాపింగ్ సీక్వెన్సులతో పాటు మూన్‌వాక్ స్టెప్పు కూడా ఉంది. దాంతో నెటిజన్లు ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకి సుమారు 20 లక్షల వీక్షణలు
వచ్చాయి. మరి, ఆ వీడియోను మీరూ చూసేయండి...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.