
పసిపిల్లల్ని తీసుకొని పని ప్రదేశానికి వెళ్తే.. వాళ్లను చూసుకోవడంతోనే సరిపోతుంది.. ఇక పనేం చేస్తుంది?’ అనుకుంటారు చూసేవాళ్లు. ఇటీవలే ఓ వెడ్డింగ్ ఫొటోషూట్‌కి హాజరైన రమను చూసిన వాళ్లంతా ఇలాగే అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే ఆమె తన మనవడిని తీసుకొని ఈ పెళ్లి ఫొటోలు తీయడానికి వెళ్లింది.
పసిపిల్లల్ని తీసుకొని పని ప్రదేశానికి వెళ్తే.. వాళ్లను చూసుకోవడంతోనే సరిపోతుంది.. ఇక పనేం చేస్తుంది?’ అనుకుంటారు చూసేవాళ్లు. ఇటీవలే ఓ వెడ్డింగ్ ఫొటోషూట్‌కి హాజరైన రమను చూసిన వాళ్లంతా ఇలాగే అభిప్రాయ పడ్డారు. ఎందుకంటే ఆమె తన మనవడిని తీసుకొని ఈ పెళ్లి ఫొటోలు తీయడానికి వెళ్లింది.
ఓవైపు వాడి ఆలనా పాలనా చూస్తూనే.. మరోవైపు పెళ్లి వేడుకలోని ప్రతి ఘట్టాన్నీ మిస్సవ్వకుండా కెమెరాలో బంధించింది. చిన్నారిని బేబీ క్యారియర్‌తో నడుముకు చుట్టుకొని.. చేతిలో కెమెరా పట్టుకొని.. వేదిక అంతా కలియతిరగడం, అందరినీ సమన్వయం చేస్తూ ఫొటోలు క్లిక్‌మనిపించడంతో ఆమె పనితీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అవడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘అందరిలా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి.. నన్ను నేను నిరూపించుకోవాలి..’ అనుకుంటారు కొందరు మహిళలు. చెన్నైకి చెందిన రమ కూడా ఇదే ఆలోచనతో పాతికేళ్ల క్రితం ఫొటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్నారు.
అప్పట్లో ఈ రంగంలో ఉన్న పురుషాధిపత్యం కారణంగా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. ‘ఫొటోగ్రఫీ అంటే నాకు చిన్నతనం నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే పెద్దయ్యాక కెమెరా పట్టుకున్నా. అప్పట్లో నేను, మావారు చిన్న ఫొటో స్టూడియో నడిపేవాళ్లం. ఈ క్రమంలో మా స్టూడియోకొచ్చే వాళ్లు ‘ఫొటోలు ఎవరు తీస్తారు?’ అనడిగేవారు.
నేనే అని చెబితే నమ్మకపోయేవాళ్లు. నన్ను స్టూడియోలో రిసెప్షనిస్ట్‌గా, ఫొటోగ్రాఫర్‌కు సహాయకురాలిగా భావించిన వారూ చాలామందే. అయినా వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఇందులో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు సాగాను. ఫొటోగ్రఫీ, ఫొటో ఎడిటింగ్..
క్లిక్‌మనిపించే ఫొటోలతోనే నా ఫొటోగ్రఫీ నైపుణ్యాలేంటో నిరూపించుకున్నా..’ అంటోన్న రమ.. ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మొదటగా చిన్న గదిలో ప్రారంభమైన తమ ఫొటో స్టూడియోను.. 2011లో ‘నవీన్ ఫొటోగ్రఫీ’ పేరుతో విస్తరించారు రమ. అప్పట్నుంచి ఇప్పటివరకు వరుస అవకాశాలు అందుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. పెళ్లి, ప్రి-వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, విడివిడిగా వధూవరుల స్టిల్స్, కపుల్ ఫొటోగ్రఫీ, జంటల రొమాంటిక్ ఫొటోషూట్స్, మెటర్నిటీ షూట్, క్యాండిడ్ ఫొటోగ్రఫీ, ఛైల్డ్ ఫొటోగ్రఫీ.. ఇలా వివిధ అంశాల్లో ఆసక్తికరంగా, సృజనాత్మకంగా ఫొటోలు తీస్తూ.. వినియోగదారులకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాల్ని బహుమతిగా అందిస్తున్నారామె.
‘చాలామంది ఫొటోల్ని జ్ఞాపకాలుగానే చూస్తారు. కానీ నేను మాత్రం ప్రతి క్లిక్ వెనుక ఓ కథ దాగుందని చెప్తా. కేవలం మాట వరసకే కాదు.. మేం క్యాప్చర్ చేసే ప్రతి ఫొటోలోనూ ఇది కనిపిస్తుంది. అంత సహజసిద్ధంగా, క్యాండిడ్‌గా ఉంటాయి మా ఫొటోలు. వాటిని చూడగానే ఎన్నేళ్ల నాటి అనుభవాలైనా ఇట్టే గుర్తొస్తాయి. తామూ ఇలాంటి అనుభూతినే పొందుతున్నామంటూ కొందరు కస్టమర్లు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ చూస్తే సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంటుంది..’ అంటూ తమ ఫొటోగ్రఫీ సేవల గురించి చెబుతున్నారు రమ. తనను తాను ‘బాస్ ఉమన్’గా పరిచయం చేసుకునే ఆమె.. తన ఫొటోషూట్స్‌ని ‘నవీన్ ఫొటోగ్రఫీ’ అనే ఇన్‌స్టా వేదికగానూ పంచుకుంటారు. ప్రస్తుతం ఈ పేజీకి 1.5 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్నారు.
తన ఫొటోగ్రఫీ నైపుణ్యాలతో ఈ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ.. ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ వివాహానికి ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. అయితే ఈ వేడుకకు తనతో పాటు తన మనవడిని కూడా తీసుకెళ్లారు. ఇది చూసి చాలామంది.. ‘పిల్లాడిని పట్టుకుని ఫొటోలెలా తీస్తుంది?’ అనుకున్నారు. కానీ అటు బాబుని చూసుకుంటూ, ఇటు ఫొటోలూ తీయడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అన్నట్లు.. రమ ఫిట్నెస్ లవర్ కూడా! తన ఎక్సర్సైజ్ రొటీనే తన యూత్‌ఫుల్ లుక్స్‌కి కారణమని ఆమె పోస్ట్ చేసే రీల్స్ చెప్పకనే చెబుతాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
వంటి అంశాలపై లోతైన అవగాహన పెంచుకున్నా. నేను