
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు గుర్రాల నాగరాజు సామాజిక సేవలో తన వంతు కృషి చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ శీతాకాలం సమీపిస్తున్న వేళ.. నిరాశ్రయులు, అనాథలు, పేద కుటుంబాలకు దుప్పట్ల పంపిణీతోపాటు పలు రకాల సాయం చేసేందుకు వివిధ కంపెనీలు, భాగస్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రముఖ సంస్థ హాల్స్ ఆయన్ను ‘వింటర్ హీర్’గా గుర్తించి అండగా నిలిచింది. 2008లో దక్షిణాఫ్రికాకు వెళ్లిన నాగరాజు మిడ్రాండ్లో స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆయన.. స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
కరోనా సమయంలోనూ వేలాది మందికి చేయూత అందించారు. ముఖ్యంగా శీతాకాలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా అక్కడి హాల్స్ సంస్థ ‘వింటర్ హీరోస్’ జాబితాలో నాగరాజును ఎంపిక చేసింది. ఇందులో భాగంగా దుప్పట్లను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.