
బన్నీ కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోలను కాదని తన పవర్ ప్రూవ్ చేసుకున్నాడు. టాలీవుడ్డే కాదు.. మరో ఇండస్ట్రీలోనూ తన జెండా ఎంత స్ట్రాంగో మరోసారి చూపించాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి మాలీవుడ్‌లో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు.
తోటి స్టార్ హీరోలను మించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా ట్రెండ్‌లో అన్ని భాషల్లోనూ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అక్కడి స్టార్లకు ధీటుగా క్రేజ్ సంపాదించుకోవడంలో మాత్రం వెనుకబడుతున్నారు.
కానీ ఈ విషయంలో బన్నీ మాత్రం కొత్త రికార్డ్ సృష్టించాడు. 'పుష్ప'తో దేశమంతా ఊపేసిన అల్లు అర్జున్.. 'పుష్ప 2'తో గ్లోబల్ రేంజ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ బ్యానర్లో 'రాక' సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ లోపు కేరళలో ఆయన పాత సినిమా హ్యాపీ (Happy) ని 4Kలో రీ రిలీజ్ చేయగా.. అది సంచలనం సృష్టించింది. బన్నీకి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలుసు. ఆయన సినిమాలన్నీ అక్కడ బాగా ఆడతాయి. కానీ 'హ్యాపీ' మాత్రం కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
కేరళలో ప్రభాస్ 'ద రాజా సాబ్', రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలు కోటి రూపాయల మార్క్ కూడా అందుకోలేక పోయాయి. కానీ 18 ఏళ్ళ నాటి 'హ్యాపీ' రీ రిలీజ్ మాత్రం కేవలం మూడు రోజుల్లోనే 95.5 లక్షల గ్రాస్ వసూలు చేసింది. నాలుగో రోజు అడ్వాన్సులతో కలపి కోటి క్లబ్‌లోకి దూసుకెళ్ళింది.
డే వైజ్ కలెక్షన్స్ చూస్తే.. మొదటి రోజు 35 లక్షలు.. రెండో రోజు 28 లక్షలు.. మూడో రోజు 32.5 లక్షలు రాబట్టింది. రీ- రిలీజ్‌తో కేరళలో ఇంత భారీ వసూళ్ళు సాధించిన నాన్-మళయాళీ హీరో అల్లు అర్జున్ ఒక్కడే. దీంతో మాలీవుడ్‌లో
బన్నీకి ఉన్న క్రేజ్ మరోసారి ప్రూవ్ అయింది.