
బెంగళూరులో జరిగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. అక్కడ యువతను ఉత్సాహపరిచారు అద్భుతమైన స్పీచ్ కూడా ఇచ్చారు. ఆ కార్యక్రమం తర్వాత ప్రకాశ్ రాజ్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. తిరుపతి కోర్టులో ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ చేశారు.
తాజాగా బీజేపీ నేత కోర్టులో కేసు వేయడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రకాశ్ రాజ్ సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలయ్యాయి. కోట్లాది భక్తుల నమ్మకాలను, మనోభావాలను గౌరవించని నటుడి సినిమాలను బహిష్కరించాలనే డిమాండ్ పెరుగుతోంది
.