
రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) చట్టం, 2016 (రెరా) డెవలపర్లనే కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లను కూడా తన పరిధిలోకి తీసుకువచ్చింది. చాలా మంది కొనుగోలుదారులు, అమ్మకందారులకు దీనిపై పూర్తి అవగాహన ఉండదు.
అయితే, రెరా కింద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులలో ఆస్తుల క్రయవిక్రయాలు జరిపే ప్రతి ఏజెంట్ తప్పనిసరిగా ఈ చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది.ఏజెంట్ అంటే ఎవరు?రెరా చట్టం ప్రకారం, ఒక ప్లాట్, అపార్ట్మెంట్ లేదా భవనం అమ్మకం లేదా కొనుగోలు లావాదేవీలలో ఒకరి పక్షాన వ్యవహరించి, దానికి ప్రతిఫలంగా కమీషన్, రుసుము లేదా మరే ఇతర రూపంలోనైనా ప్రతిఫలం పొందే ఏ వ్యక్తినైనా 'రియల్ ఎస్టేట్ ఏజెంట్'గా పరిగణిస్తారు. ఇందులో ప్రాపర్టీ డీలర్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు అందరూ వస్తారు.
చట్టంలోని కీలక నిబంధనలురెరా చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం, ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా సంబంధిత రాష్ట్ర రెరా అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, రెరా కింద నమోదైన ప్రాజెక్టులలో ఎలాంటి అమ్మకాలు లేదా కొనుగోళ్లకు మధ్యవర్తిత్వం చేయకూడదు. ఇది చట్టప్రకారం తప్పనిసరి.
ఇక సెక్షన్ 10, రిజిస్టర్డ్ ఏజెంట్ల విధులు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశిస్తుంది. వారు కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించకూడదు, ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పత్రాలను, వివరాలను కలిగి ఉండాలి.రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నియమాలుఏజెంట్లు తమ రాష్ట్రంలోని రెరా అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలి.
ఒకసారి రిజిస్ట్రేషన్ పొందితే, ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మొత్తం