
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారాయన. హైదరాబాద్, జూన్ 16: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ స్కూల్‌ను రేపు(బుధవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఎక్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది’.. అన్నది ఇకపై ఒక నినాదం మాత్రమే కాదు..
కళ్ల ముందు కనిపించే నిజం. ఆ నిజానికి సాక్ష్యం ఆరుట్లలోని ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న నా సంకల్పానికి రూపమే తెలంగాణ పబ్లిక్ స్కూల్' అని రాసుకొచ్చారు.
'చరిత్ర పుటల్లో కలిసిపోతున్న సర్కారు బడి ప్రజా పాలనలో నేడు మళ్లీ పూర్వ వైభవాన్ని మించిన వైభవంతో, సకల సౌకర్యాలతో, ఆధునిక వసతులతో, పిల్లల మేధో వికాస్ క్షేత్రంగా నిలవబోతోంది. తెలంగాణ బిడ్డల పాలిట సరస్వతీ కటాక్ష ఆలయంగా రూపుదిద్దుకున్నది.
ఆకలి తీర్చి, అక్షరాలు నేర్పి, ఆటను ప్రోత్సహించి పిల్లల్లో మనోవికాసం వికసించేలా, మట్టిలో మాణిక్యాలను తీర్చి దిద్దే సకల హంగులతో రూపుదిద్దుకున్న నా మానస పుత్రిక ఈ పాఠశాల. ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’కు రూపం ఇచ్చే కార్యంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
విద్యార్థులకు అభినందనలు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న నేటి ఈ ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఆరంభం మాత్రమే. తెలంగాణ వ్యాప్తంగా భవిష్యత్తులో వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడం తదుపరి మా కర్తవ్యం’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు..
Read Latest Telangana News And Telugu News
జూన్ 23 నుంచి సంప్రదింపులు