
Rayapati Shailaja: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ అంశంపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
read also: Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ స్పందిస్తూ, మహిళా ప్రజాప్రతినిధిని ఆమె రూపం లేదా దుస్తులు, మేకప్ గురించి మాట్లాడటం విమర్శించడం సరైన రాజకీయ సంస్కృతి కాదని పేర్కొన్నారు.
రాజకీయాల్లో విధానాలు, పాలనపై విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం అనుచితమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా మహిళా సమాజం మొత్తాన్ని అవమానపరిచే విధంగా ఉంటాయని శైలజ అభిప్రాయపడ్డారు.
మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు వారిని నిరుత్సాహపరచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహిళా కమిషన్కు పలువురు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. కేవలం వ్యాఖ్యలు చేయడమే కాకుండా, వాటిని సమర్థించే విధంగా స్పందించడం కూడా ఆందోళన కలిగించే అంశమని కమిషన్ భావిస్తోంది.
ఈ వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన మహిళా కమిషన్, గుడివాడ అమర్నాథ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి లేఖ రాయాలని నిర్ణయించింది. అలాగే ఈ అంశంపై వివరణ కోరేందుకు అమర్నాథ్కు సమన్లు జారీ చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
Modi : అల్లు అర్జున్ క్రేజ్ ను వాడుకున్న మోడీ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Jagan – CBN : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్ Nara Lokesh: జులైలో ‘తల్లికి వందనం’
.. విద్యాశాఖకు లోకేశ్ కీలక ఆదేశాలు
Pawan Delhi Tour : కేంద్ర మంత్రులతో పవన్ బిజీ ..బిజీ
Pawan kalyan: ఢిల్లీలో పవన్ కీలక భేటీ.. ఏపీ నీటి సమస్యలపై కేంద్రంతో చర్చలు!
Vangalapudi Anita: ఏపీలో క్రైం రేటు 14.1 శాతం తగ్గింది: అనిత
Srisailam Temple Donation: శ్రీశైలం అన్నదానానికి దంపతుల భారీ విరాళం