
బూర్గంపహాడ్, జూన్ 16 : ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తూ బూర్గంపహాడ్ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... ఒడిస్సా నుండి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్ వాహనంపై అక్రమంగా 2.1 కిలోల గంజాయి తరలిస్తుండగా ములుగు జిల్లా మంగపేటకు చెందిన బడే భరత్, ఉప్పరపల్లి వెంకటేశ్‌ను మండల పరిధిలోని సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద పోలీసులు పట్టుకున్నారు.
పట్టుబడిన గంజాయి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయితో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు
.