
యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌కు నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. శ్రీనిధి యూనివర్సిటీ టీజీ 20 టైటిల్ స్పాన్సర్‌గా ఉండనుందని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 21 నుంచి ఉప్పల్ స్టేడియంలో మెగా క్రికెటింగ్ ఈవెంట్ జరుగుతుందని టీజీ 20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు తెలిపారు. టీజీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్‌కు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బేగంపేట్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్‌రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు, హెచ్‌సీఏ ప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ తరఫున ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, ఇతర ఫ్రాంచైజీ యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్, రామోజీ గ్రూప్ ఎప్పటినుంచో మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తోందని హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ప్రతినిధి బృహతి తెలిపారు.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఛాంపియన్ పేజీ రూపంలో ప్రతిభను వెలికితీస్తోందని వివరించారు. ఈ వార్త చదివారా: తెలంగాణ అభివృద్ధిపై మాకెవరూ పాఠాలు చెప్పనక్కర్లేదు: కిషన్‌రెడ్డి