
తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రాన్ని మంగళవారంనాడు విడుదల చేసింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆ శ్వేతపత్రంలో పేర్కొంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రాన్ని మంగళవారంనాడు విడుదల చేసింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, ఖజానా ఖాళీ అయిందని ఆ శ్వేతపత్రంలో పేర్కొంది.
రాష్ట్ర మొత్తం ఆర్థిక భారం రూ.13.18 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. ప్రత్యక్ష రుణభారం దాదాపు రూ.10 లక్షల కోట్లుగా పేర్కొంది. ఎంకే స్టాలిన్ సారథ్యంలోని గత డీఎంకే ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రాష్ట్ర రుణ భారం దాదాపు రెట్టింపయిందని, రాష్ట్రంలో పుట్టే ప్రతి చిన్నారిపై రూ.1.28 లక్షల అప్పుభారం పడుతోందని ఆ నివేదిక పేర్కొంది.
రాష్ట్ర ఆర్థిక లోటు 78,324 కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 22.8 పైసలు అప్పులపై వడ్డీ చెల్లింపులకే పోతోందని శ్వేతపత్రం తెలిపింది. జీఎస్టీ ఆదాయ వృద్ధి కేవలం 5.45 శాతంగా ఉందని, ఆదాయానికి, అప్పులకు పొంతనే ఉండటం లేదని పేర్కొంది.
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా.. నాయకత్వంపై అసంతృప్తి భవానీపూర్ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్