
కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ మంత్రి నారా లోకేశ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర, జాతీయ కార్యవర్గంతో ఈరోజు(మంగళవారం) మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది.
అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని యువనేత దిశానిర్దేశం చేశారు. తమ ఇబ్బందులను కొంతమంది ఎమ్మెల్యేలు లోకేశ్‌కి వివరించారు. అర్హులైన వారు కొత్త పెన్షన్లు అడుగుతున్నారని తెలిపారు. గ్రామానికి వెళ్లిన వెంటనే చిన్న చిన్న పనులు అడుగుతున్నారని, దీనికి కొంత నిధులు ఇవ్వాలని కోరారు.
ఈ సమస్య తనకు కూడా ఉందని.. ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు. అన్ని విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని యువనేత మార్గనిర్దేశం చేశారు.
వారానికి కనీసం నాలుగు రోజులైనా ఈ కార్యక్రమం నిర్వహించాలని లోకేశ్ ఆదేశించారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News