
అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) హెచ్చరించారు.
అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు. ఈరోజు (మంగళవారం) పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడి నైజం..
ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి నైజమని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ సబ్సిడీ కేవలం రూ.750 కోట్లు ఇచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం రొయ్యల రైతులకు ఏడాదికి రూ.1,170 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇస్తుందని స్పష్టం చేశారు.
సోయాబీన్, ఫిష్ ఆయిల్ ధరలు పెరిగిన మాట వాస్తవమేనని చెప్పుకొచ్చారు. ముడి పదార్థాల ధరల భారం రైతులపై ఒక్కసారిగా మోపడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికారులు, రైతులు, తయారీదారులతో కూడిన కమిటీ ద్వారానే ఇకపై ధరల నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. జోన్, నాన్-జోన్, 10 ఎకరాల పరిమితి నిబంధనలని తొలగించామని తెలిపారు. ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్‌కు రూ.1.50కే విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
గతంలో ల్యాబ్‌ల పేరుతో ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో సౌకర్యాలు లేవని ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వచ్చి వాస్తవాలు పరిశీలించాలని గొడ్డలి పార్టీ అధ్యక్షుడుకి సవాల్ విసిరారు. ఫీడ్ ధరల నియంత్రణకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
సింగపూర్ ప్రధాని