
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ పీసీ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. కాకినాడ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై (Gnaneshwar case) పెద్దాపురం డీఎస్పీ తిలక్ (Peddapuram DSP Tilak) కీలక విషయాలు వెల్లడించారు.
చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈరోజు(మంగళవారం) డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడారు.35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్సయిందని చెప్పుకొచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
జీడిపిక్కల ఏరుకునే వారిని కూడా పిలిచి చిన్నారి గురించి విచారించామని తెలిపారు. పాప మిస్సయిన చోట బొమ్మలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. చిన్నారికి సంబంధించి నెగెటివ్ వార్తలను ప్రచురించే వారిపై లీగల్గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాపను జంతువులు తీసుకొని వెళ్లాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. జీడిపిక్కలను ఏరుకునే సంచార జాతుల వారిపై నిఘా పెట్టి విచారణ చేస్తున్నామని తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబం పెంచుకుంటున్న కుక్కకు నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతోనే చనిపోయిందని వెల్లడించారు.
పోస్టుమార్టం రిపోర్ట్ రెండు రోజుల్లో వస్తుందని డీఎస్పీ తిలక్ పేర్కొన్నారు
.