
MATA: ‘మన అమెరికా తెలుగు సంఘం’ (MATA) నిర్వహిస్తున్న రెండో మహాసభల (MATA 2nd Convention 2026) వేదికపై తెలుగు జానపద సాహిత్యం , సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు.. ఈ సాహిత్య , సాంస్కృతిక కార్యక్రమం జూన్ 20, 2026న సాయంత్రం 4:00 గంటల నుండి 5:00 గంటల వరకు, ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లోని ‘మీటింగ్ రూమ్ 5’లో నిర్వహించనున్నారు.
ప్రముఖ జానపద పరిశోధకుడు , ఆల్ ఇండియా రేడియో గాయకుడు డాక్టర్ లింగా శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఉపన్యాసకులుగా వ్యవహరించనున్నారు, ప్రఖ్యాత జానపద సాహిత్య పరిశోధకుడు శేషగిరిరావు కంభంమెట్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరై తెలుగు జానపద వైభవాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాలకు , రిజిస్ట్రేషన్ కోసం convention.mata-us.org వెబ్సైట్ను సందర్శించవచ్చు
.