
నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించిన నకిలీ ప్రశ్నపత్రాలు, పేపర్ లీక్ ప్రచారాలు, మోసపూరిత సందేశాలు ప్రధానంగా టెలిగ్రామ్ ఛానెల్‌లు, గ్రూపుల ద్వారా వ్యాపించినట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందాయి. లక్షలాది మంది సభ్యులతో కూడిన పబ్లిక్ ఛానెల్‌లు, అనామకంగా నిర్వహించే గ్రూపులు టెలిగ్రామ్‌లో విస్తృతంగా ఉండటంతో అక్రమ కార్యకలాపాలకు అది వేదికగా మారిందని అధికారులు భావిస్తున్నారు (NEET Re-Test 2026).
ఒకసారి టెలిగ్రామ్‌లో ప్రొఫైల్ సృష్టించుకున్న తర్వాత, గుర్తింపును అజ్ఞాతంగా ఉంచుకుంటూ, అపరిమిత సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు ఉండే ఛానెల్‌ను సృష్టించడం చాలా సులభం. అంటే, ఒక బృందం తమ గుర్తింపును దాచుకుని, లక్షలాది మంది సబ్స్ర్కైబర్లతో ఒక ఛానెల్‌ను నడపగలదు.
ఆ ఛానెల్ వెనుక ఎవరున్నారో గుర్తించడం చాలా కష్టం. వాట్సాప్‌లో అలాంటి సౌలభ్యం ఉండదు. ఇక ఫైల్ షేరింగ్ విషయంలో కూడా టెలిగ్రామ్ చాలా ఎక్కువ సౌకర్యాలను అందిస్తుంది. ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎలాంటి కంప్రెషన్ లేకుండా 2జీబీ ఫైళ్లను కూడా షేర్ చేయవచ్చు.
వినియోగదారులు వ్యక్తిగతంగా ఏమి పంచుకుంటున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో తాము చూడలేమని వాట్సాప్ చెబుతున్నప్పటికీ, అది ఏఐ టూల్స్‌ని ఉపయోగించి పబ్లిక్ గ్రూపులలో వినియోగదారుల ప్రవర్తనను పర్యవేక్షించగలదు. ఈ పర్యవేక్షణ కారణంగానే సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు వాట్సాప్ కాకుండా టెలిగ్రామ్ వైపు మొగ్గు చూపుతుంటారు.
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై.. సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు
..