
Nissan Magnite EMI: జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలో నిస్సాన్ మ్యాగ్నైట్‌ను విక్రయిస్తోంది. ఈ తయారుదారు సంస్థ సీఎన్జీ వేరియెంట్ ను కూడా విసియా సీఎన్జీని అందిస్తుంది. మీరు ఈ SUV నుంచి విడుదలైన విసియా కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే కేవలం లక్ష రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే ఈ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
అయితే నెలవారి ఈఎంఐ ఎంత చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిస్సాన్, మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ CNG వేరియంట్‌గా విసియా CNGని అందిస్తోంది. ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.33 లక్షలు. మీరు ఈ కారును ఢిల్లీలో కొనుగోలు చేస్తే, సుమారుగా రూ.44,000 రోడ్ టాక్స్, సుమారుగా రూ.30,000 ఇన్సూరెన్స్ చెల్లించాల్సి ఉంటుంది.
దీనితో నిస్సాన్ మాగ్నైట్ విసియా CNG ఆన్-రోడ్ ధర సుమారుగా రూ.7.08 లక్షలకు చేరుతుంది. మీరు ఈ కారు బేస్ CNG వేరియంట్ అయిన విసియాను కొనుగోలు చేస్తే, బ్యాంకు వాహనాన్ని ఎక్స్-షోరూమ్ ధరకే ఫైనాన్స్ చేస్తుంది. కాబట్టి రూ.100,000 డౌన్ పేమెంట్ చేసిన తర్వాత, మీరు బ్యాంకు నుండి సుమారుగా రూ.6.08 లక్షలు ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ బ్యాంకు మీకు రూ. 6.08 లక్షలను 7సంవత్సరాల కాలానికి 9శాతం వడ్డీకి రుణం ఇస్తే, మీరు రాబోయే 7 సంవత్సరాల పాటు నెలకు రూ. 9,784 చొప్పున EMI చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒక బ్యాంకు నుండి రూ. 6.08 లక్షల కారును ఏడేళ్ల కాలానికి 9శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే, మీరు ఏడేళ్లపాటు నెలకు రూ.
9,784 EMI చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఏడేళ్లలో, మీరు ఒక నిస్సాన్ మాగ్నైట్ విసియా CNG కారు కోసం సుమారుగా రూ. 2.3 లక్షల వడ్డీని చెల్లిస్తారు. దీని తర్వాత, ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ వడ్డీతో కలిపి మీ కారు మొత్తం ధర సుమారుగా రూ.
9.21 లక్షలు
అవుతుంది.
భారత మార్కెట్లో, నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో వచ్చింది. ఇది మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, కియా సైరోస్లతో నేరుగా పోటీపడుతుంది.