
Indian Railways New Ticket Rules: మీరు భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తుంటారా? ఒకవేళ మీకు తదుపరి ప్రయాణాల ప్లాన్ ఉంటే, ఇది మీకు ఒక గుడ్ న్యూస్. ప్రతిరోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. కానీ ఒక్కోసారి వెయిటింగ్ లిస్ట్ కారణంగా ట్రైన్ మిస్ అయ్యే అవకాశం లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
అయితే, ఇప్పుడు రన్నింగ్ ట్రైన్ లో కూడా ఖాళీగా ఉన్న సీట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. భారతీయ రైల్వే, IRCTC సహకారంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. సాధారణంగా రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది..
అయినప్పటికీ ఒక్కోసారి టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఏ స్టేషన్ నుంచైనా కన్ఫర్మ్ టికెట్ పొందవచ్చు. హ్యాండ్ హెల్డ్ టెర్మినల్ (HHT) అప్‌గ్రేడ్ తర్వాత, రైలులోని ఖాళీ సీట్లు IRCTC వెబ్సైట్లో నేరుగా కనిపిస్తాయి, వీటిని మీరు బుక్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ (WL) సమస్యతో ఇబ్బంది పడే ప్రయాణికులకు ఈ కొత్త నిబంధన వరం లాంటిది. ఒకవేళ ట్రైన్ బయలుదేరిన తర్వాత కూడా మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, ఖాళీగా ఉన్న సీటును టీటీఈ (TTE) మీకు కేటాయిస్తారు. టికెట్ బుకింగ్ ప్రక్రియలో భారతీయ రైల్వే పాత విధానాన్ని తొలగించి, కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన హ్యాండ్ హెయిర్ టెర్మినల్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను రైల్వే సాంకేతిక విభాగం, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) కు అప్పగించింది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్తోపాటు, కన్ఫర్మ్ బెర్త్ బుకింగ్ ఆప్షన్ కూడా టీటీఈ పరికరంలో (TTE Device) జోడించేస్తారు. ఈ హైటెక్ వ్యవస్థ అమలు కావడంతో పాటు, టీటీఈలకు అవసరమైన సాంకేతిక శిక్షణను కూడా రైల్వే అందించనుంది.
ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను బుక్ చేసుకుని, అది కన్ఫర్మ్ అయినప్పటికీ ప్రయాణించలేకపోతే, టికెట్ తనిఖీ సమయంలో టీటీఈ తన పరికరంలో ఆ సీటు ఖాళీగా ఉందని అప్డేట్ చేస్తారు. ఆ మార్పు జరిగిన వెంటనే, IRCTC రైల్వే బుకింగ్ పోర్టల్‌లో ఆ సీటు ఖాళీగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వారు ఏ స్టేషన్ నుంచైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
మీరు వెళ్లే రూట్లో ఏ స్టేషన్ నుంచైనా టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఇప్పుడు లభిస్తుంది. దీనివల్ల మీకు అందుబాటులో ఉన్న సీటును వెంటనే బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ సౌకర్యం లేదు, కానీ ఇప్పుడు అది అందుబాటులోకి వచ్చింది.
ఒకవేళ మీరు సూపర్ ఫాస్ట్