
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Sircilla Matchbox Silk Saree: మన భారతీయ చేనేత కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే.. మరో అద్భుతమైన అరుదైన ఘట్టం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆవిష్కృతమైంది.
అగ్గిపెట్టెలో పట్టే.. అత్యంత సూక్ష్మమైన, అరుదైన పట్టుచీరను ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు.. చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయ్ కుమార్ తన చేతులతో మగ్గంపై అద్భుతంగా నేసిన ఈ ప్రత్యేక పట్టుచీరను మంగళవారం అమ్మవారికి కానుకగా అందించారు.
వారం రోజుల శ్రమ.. ఈ అద్భుతమైన లలిత కళాఖండాన్ని రూపొందించడానికి విజయ్ కుమార్ దాదాపు వారం రోజుల పాటు రాత్రి పగలు మగ్గంపై శ్రమించారు.. ఈ పట్టుచీర పొడవు 5.5 మీటర్లు కాగా..వెడల్పు 48 అంగుళాలు ఉంది. ఇంత పెద్ద చీర అయినప్పటికీ..
దీని మొత్తం బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం.. సాంప్రదాయ ఇక్కత్ డిజైన్‌తో.. అత్యంత అద్భుతంగా.. ఆకర్షనీయమైన రంగులతో నేసిన ఈ చీరను మడత పెడితే.. ఒక చిన్న అగ్గిపెట్టేలో సులువుగా పడుతుంది. సిరిసిల్ల నేతన్నల మంచి నైపుణ్యానికి ఈ చీర నిదర్శనమని చెప్పొచ్చు..
అమ్మవారు కనకదుర్గమ్మపై ఉన్న భక్తితో.. మా సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచాలనే సంకల్పంతో ఈ చీరను నేచారని చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ తెలిపారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న విజయ్ కుమార్.. దుర్గమ్మ ఆలయ ఈవో
వి.కె. శీనా నాయక్‌ను కలిసి ఈ పట్టుచీరను అధికారికంగా అందజేశారు.. ఒక చిన్న అగ్గిపెట్టెలోంచి 5.5 మీటర్ల పట్టుచీరను బయటకు తీసి చూపిస్తుంటే ఆలయ అధికారులతో పాటు అర్చకులు, అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది..
ఇంతటి చాలా అద్భుతమైన కళాఖండాన్ని అమ్మవారికి సమర్పించిన విజయ్ కుమార్‌ను ఈవో శీనా నాయక్ శాలువాతో సత్కరించి.. అమ్మవారి ప్రసాదాన్ని అందించి ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఈ వార్తకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు సిరిసిల్లకు చెందిన చాలా మంది చేనేతలు ఇలాంటి చీరలను ఎన్నో నేచారు. అంతేకాకుండా చాలా మంది విదేశీయులు కూడా ఇలాంటి చీరలను కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చీరలను చాలా అరుదుగా మాత్రమే నేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.