
PM Kisan 23rd Installment: రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అందుబాటులోకి తెచ్చాయి. ప్రధానంగా వారికి మెరుగైన ఆర్థిక సహాయం అందించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఈ పథకం ద్వారా ప్రతి విడతలో రైతులకు రూ. 2,000 చొప్పున, ఏడాది మొత్తానికి రూ.6,000 నేరుగా డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా ఖాతాలో జమ అవుతాయి. ప్రధానమంత్రి కిసాన్ తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్న రైతులు, 23వ విడతకు సంబంధించి కొన్ని పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి.
ముఖ్యంగా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యం. కొన్ని వార్తాపత్రికల నివేదికల ప్రకారం, ఈ రూ.2 వేలు జూన్ చివరి తేదీలోగా జమ అయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాబట్టి, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి. ఈ సాంకేతిక ప్రక్రియలన్నీ పూర్తి చేస్తే, రూ.2,000 సులభంగా మీ ఖాతాలో జమ అవుతాయి. ముందుగా మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ ఉందో లేదో చూసుకోండి.
డీబీటీ ప్రక్రియ సరిగ్గా లేకపోతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, తద్వారా నిధులు జమ కావు. అంతేకాకుండా.. ఈకేవై (e-KYC) పూర్తి చేయని వారు తప్పనిసరిగా ఈ పనిని పూర్తి చేయాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. నిధులు జమ కావాలంటే వెరిఫికేషన్ తప్పనిసరి.
ప్రభుత్వ భూ రికార్డులలో కూడా అన్ని వివరాలు పూర్తిస్థాయిలో ఉండాలి. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత, మీరు పీఎం కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) లోని 'బెనిఫిషియరీ స్టేటస్' విభాగంలో మీ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఏదైనా పని చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురైతే, వెంటనే మీ దగ్గరలోని కామన్
సర్వీస్ సెంటర్ (CSC) ను సంప్రదించి, ఈకేవైసీ, బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోండి. ఈ పీఎం కిసాన్ పథకం కేవలం అర్హులైన రైతులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోండి.