
జాన్వీ పై ట్రోలింగ్ జరుగుతున్నా మేకర్స్ లైట్ తీసుకున్నారా? మొదట్లో సీరియస్ గా తీసుకున్న బుచ్చిబాబు సారీ చెప్పినా.. జాన్వీ సీన్స్ మరో రెండు ఎందుకు కలుపుతున్నారు? ఎవరూ ఊహించని విధంగా ‘చికిరి’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయడంలో అర్థం ఏంటి?
‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అచ్చియమ్మ రోల్ లో జాన్వీని అగ్లీగా చూపించడంతో వచ్చిన నెగిటివిటీ, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ను డామినేట్ చేసింది. సినిమా రిలీజ్ అయి 11 రోజులు దాటినా.. ఇప్పటికీ జాన్వీ రోల్ గురించే మాట్లాడుకుంటూనే ఉన్నారు.
జాన్వీ క్యారెక్టర్ మేకింగ్ ఎఫెక్ట్ సినిమాపై పడటంతో, దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పడమే కాదు.. శృతి మించిన సీన్స్ ను కట్ చేశారు. అయితే, త్వరలో జాన్వీ నటించిన మరో రెండు సీన్స్ కలుపుతున్నాము అన్నాడు దర్శకుడు. ఇవి ఎలా ఉంటాయి? మళ్ళీ ట్రోలింగ్ చేస్తారా?
అని జాన్వీ ఫ్యాన్స్ భయపడుతున్నారు. జాన్వీ పై వచ్చిన ట్రోలింగ్ ను మర్చిపోతున్న టైంలో లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ చిచ్చు రేపాడు. రీసెంట్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. “ఐటెం సాంగ్ ను ఆస్వాదించిన వాళ్లే ఐటెం గాళ్లు” అనడం మళ్ళీ విమర్శలకు దారి తీసింది.
జాన్వీ రోల్ ను సమర్థించిన అనంత శ్రీరామ్ పై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. ‘చికిరి’ సాంగ్ లో జాన్వీని చూపించిన విధానాన్ని తప్పు పట్టారు ప్రేక్షకులు. జాన్వీ అందాలను క్లోజప్ లో అగ్లీగా చూపించారు. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన 12వ రోజునే ఈ కాంట్రవర్సీ సాంగ్ ను రిలీజ్ చేయడంతో మళ్ళీ చర్చ మొదలైంది.
చికిరి సాంగ్ ‘పెద్ది’ కి హైప్ తీసుకొచ్చింది, రిలీజ్ కి ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టినా.. ఆ తర్వాత జాన్వీని చూపించిన విధానం ట్రోల్ అయింది. ఇవి ఏవీ పట్టించుకోకుండా సర్ప్రైజ్ చేస్తూ ఫుల్
సాంగ్ ను రిలీజ్ చేయడం షాక్ ఇస్తోంది. ఈ ఫుల్ సాంగ్ ట్రోల్స్ కు మంచి ఫీడ్ అవుతుందన్న భయం మెగా ఫ్యాన్స్ కు లేకపోలేదు.