
Valigonda: వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయి పర్యటన మార్కాపురం జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు రెండో సొరంగంలో కొనసాగుతున్న లైనింగ్ పనులు, టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) తొలగింపు పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించిన రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. కొల్లంవాగు నుంచి ఒక టీఎంసీ నీరు టన్నెల్లోకి చేరేలా అడ్డుగా ఉన్న 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మక్లో ఇప్పటికే 58 వేల క్యూబిక్ మీటర్లను తొలగించినట్లు వెల్లడించారు.
అలాగే టన్నెల్-1లో అడ్డంకిగా ఉన్న 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మక్లో ఇప్పటివరకు 40 వేల క్యూబిక్ మీటర్ల తొలగింపు పూర్తయిందన్నారు. టన్నెల్-2లో 7 కిలోమీటర్ల లైనింగ్ పనుల్లో ఇప్పటికే 5.5 కిలోమీటర్ల మేర పూర్తి కాగా, మిగిలిన 1.5 కిలోమీటర్ల పనులను జూలై నెలాఖరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిలిచిపోయిన టిబిఎం యంత్రాన్ని వెలికితీసే పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. టిబిఎం యంత్రంలోని ఏడు కంపార్ట్మెంట్లలో మూడు ఇప్పటికే బయటకు తీసుకొచ్చామని, అత్యంత క్లిష్టమైన హెడ్ భాగాన్ని టన్నెల్‌లోనే పూడ్చిపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఫీడర్ కెనాల్లో 5.3 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ పనులను ఈ ఏడాది జనవరిలో ప్రారంభించి ఐదు నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. 21 కిలోమీటర్ల లైనింగ్ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో వాటిని వేగవంతం చేయాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పూడ్చి మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్ పనులతో పాటు శాశ్వత డైవర్షన్ రహదారి నిర్మాణం కూడా జూన్ నెలాఖరులోగా పూర్తికానుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాగునీటి సీజన్ ప్రారంభానికి ముందే నల్లమలసాగర్ రిజర్వాయర్‌ను నీటితో నింపేలా పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. నిర్వాసితుల పునరావాసం కోసం అదనపు బడ్జెట్లో రూ.905 కోట్లు కేటాయించామని, ఈ నెలలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్అండ్ఆర్ పరిహారం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ పర్యటనలో కందుల నారాయణరెడ్డి, గూడూరు ఎరిక్షన్ బాబు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబుతలిం, ఇంజినీరింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మెంధా తుఫాను కారణంగా ఫీడర్ కెనాల్‌కు ఏర్పడిన భారీ గండిని సీసీ వాల్ నిర్మాణం ద్వారా