
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందన్నారు. అమరావతి, జూన్ 16: జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.
జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను సమన్వయం చేస్తుందన్నారు.
ఢిల్లీ పర్యటన అనంతరం ఈ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నట్లు పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేశ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరణి మదన్ సభ్యులుగా ఉంటారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్లో ‘CBN@361 Degrees - Polymath’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు