
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విజయవాడ రూట్లో 18 రైళ్లు రద్దు ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి.
వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పరీక్ష ప్రశ్నలను పోలిన వందలాది ప్రశ్నలు ముందుగానే చక్కర్లు కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. పరీక్ష విశ్వసనీయత దెబ్బతినడంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ సంయుక్తంగా మే 3 నాటి పరీక్షను రద్దు చేసి, జూన్ 21న దేశవ్యాప్తంగా మళ్లీ పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి.
గత పరీక్ష సమయంలో కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్‌లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ ఫీచర్‌ను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్లు ఎన్టీఏ గుర్తించింది. పాత సందేశాలను ఎడిట్ చేసి, అసలు టైమ్‌స్టాంప్‌ను మార్చకుండా ఉంచడం ద్వారా పేపర్ ముందే లీక్ అయినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించి విద్యార్థులను గందరగోళానికి గురిచేశారు.
ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు దేశంలో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. జూన్ 21న జరిగే పరీక్షను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు ఫేక్ గ్రూపులు, బాట్ల ద్వారా తప్పుడు ప్రచారం చేయకుండా నిరోధించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు
.