
Mars Transit In Krittika Nakshatra 2026: కుజుడి ప్రభావంతో కొన్ని రాశులవారికి ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల దీర్ఘకాకలి సమస్యలు దూరమవుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Mars Transit In Krittika Nakshatra 2026: జూన్ 16వ తేది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైనది భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజున కుజుడు నక్షత్ర సంచారం చేసింది. ముఖ్యంగా సూర్యుడి నక్షత్రంగా భావించే కుజుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
ఈ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కుజుడిని ధైర్యం, బలం, పరాక్రమం, భూ-ఆస్తితో పాటు నాయకత్వానికి అధిపతిగా సూచిస్తారు. సూర్య, కుజ గ్రహాలను స్నేహపూర్వక గ్రహాలుగా పరిగణిస్తారు.
కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కృత్తిక నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల మేష రాశివారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగాల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా అద్బుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు.. కాబట్టి కుజుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల సింహ రాశివారికి కూడా మంచి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల పరంగా పదోన్నతలు లభిస్తాయి.
పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి విముక్తి కూడా లభిస్తుంది. కుజుడు కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశివారికి
కూడా ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కోర్టు లేదా న్యాయపరమైన విషయాల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా శత్రువులపై కూడా ఊహించని విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త భూములతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సమయంలో ధనుస్సు రాశివారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా సులభంగా నెవరేరుతాయి. వ్యాపారాల పరంగా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. పెట్టుబడుల నుంచి కూడా మంచి మంచి రాబడులు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న బోలెడు లాభాలు కలుగుతాయి.