
Hayathnagar Govardhan Suicide Case: తొందరపాటు నిర్ణయాలు, స్వార్థపూరిత ఆలోచనలు అభం శుభం తెలియని ఒక పసికందును అనాథను చేశాయి. హయత్‌నగర్‌లో గత నెలలో సంచలనం సృష్టించిన యువకుడి ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకుని, కన్న బిడ్డను వదిలించుకుని వేరే పెళ్లికి సిద్ధమైన ఒక యువతి నిర్వాకం చివరకు ఒకరి ప్రాణం తీయగా, రెండు నెలల పసిపాపను అనాథాశ్రమానికి చేర్చింది. Read Also :Warangal IT Employee Keerthana:సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చిన ముప్పు..
పని ఒత్తిడి భరించలేక యువ టెక్కీ ఆత్మహత్య! హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు, సరిత అనే యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలో వీరికి ఒక బిడ్డ జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత సరిత మనసు మారింది. గోవర్ధన్‌ను వదిలించుకుని, తన బంధువుల అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. కన్న బిడ్డను వదిలించుకుంటేనే ఈ పెళ్లి సాధ్యమవుతుందని ప్లాన్ వేసింది.
భార్య తనను మోసం చేసిందని, బిడ్డను కూడా దూరం చేస్తోందని తెలుసుకున్న గోవర్ధన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనతో వచ్చేయమని ఎంత బతిమాలినా సరిత వినకపోవడంతో.. గత నెల 15వ తేదీన తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
గోవర్ధన్ ఆత్మహత్య తర్వాత పోలీసులు సరితను, ఆమె పెళ్లి చేసుకున్న బంధువును అరెస్ట్ చేశారు. అయితే, గోవర్ధన్ ఫ్యామిలీ తమకు మనవడు/మనవరాలు కావాలని కోరడంతో, అసలు ఆ బిడ్డ ఎక్కడున్నాడనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు.
గతంలో సరిత గర్భవతిగా ఉన్న సమయంలో మన్నెగూడలోని ఒక ఆర్ఎమ్పీ డాక్టర్ వద్దకు వెళ్లారు. అక్కడ డెలివరీ సాధ్యం కాకపోవడంతో మరో ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. అప్పటికే విడిపోవాలని
డిసైడ్ అయిన ఈ ప్రేమజంట.. ప్రసవం కాగానే ఆ పసికందును మన్నెగూడలోని కొందరు స్థానికులకు ఇచ్చేసి వదిలించుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా హయత్‌నగర్ పోలీసులు ఆ ప్రాంతంలో గాలించి, రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ శిశువు ఆచూకీని సక్సెస్‌ఫుల్‌గా కనుగొన్నారు.
తండ్రి ఆత్మహత్య చేసుకోగా, తల్లి జైలు పాలవడంతో.. లభించిన పసికందును పోలీసులు అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ శిశువిహార్ (Shishu Vihar) కేంద్రానికి భద్రంగా తరలించారు. కన్నవారి పాపానికి ఏ తప్పూ తెలియని పసిప్రాణం ఇలా అనాథగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
Air India, IndiGo: ATF పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Warangal IT Employee Keerthana:సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చిన ముప్పు.. పని ఒత్తిడి భరించలేక యువ టెక్కీ ఆత్మహత్య!
Tirupati crime: మైనర్ బాలికను గర్భవతిని చేసిన వివాహితుడు.. నిందితుడు అరెస్ట్
Nellore Duvvuru Family Suicide Case:కొడుకు అమాయకుడని భార్యతో సహా రిటైర్డ్ టీచర్ సామూహిక ఆత్మహత్య!
Maharashtra crime: నాగ్‌పూర్‌లో ఘోరం.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం
Karnataka Ex Army Murder :రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం మాజీ సైనికుడిని చంపిన భార్య!
Sanchita Ugale Last Video: ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?