జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు మిగిలిన రాజకీయ పార్టీల నుంచి నేతల్ని, విద్యా వంతులు, సామాజికవేత్తలు, తటస్థుల్ని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు.
జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించారు పవన్ కళ్యాణ్. మొత్తం14 మంది సభ్యులతో ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఏర్పాటు చేయగా.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బాలినేనిని ఉమ్మడి రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించి..
స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ బాధ్యతలు అప్పగించారు. తాజాగా పార్టీలో చేరికలకు సంబంధించిన కమిటీలో నియమించారు. జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీలో మొత్తం 14 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి జనసేన పార్టీలో చేరికల్ని సమన్వయం చేస్తారు.
జనసేన పార్టీ నియమించిన కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, పంతం నానాజీ, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ లింగమనేని రమేష్‌లు ఉన్నారు. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభానులను నియమించారు.
జనసేన పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చినబాబు, డా.హరిప్రసాద్, డా.పెదపూడి విజయ్ కుమార్, కొరికాన రవికుమార్, వంపూరు గంగులయ్య, టి సి వరుణ్, ఆరణి మదన్‌లను కూడా కమిటీలో నియమించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి రాగానే ఈ చేరికల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తారు.
జనసేన పార్టీలోకి చేరికలపై దిశానిర్దేశం చేయనున్నారని జనసేన పార్టీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణలో కూడా త్వరలోనే జనసేన పార్టీకి జాయినింగ్స్ కమిటీని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొన్నటి వరకు పాలనాపరమైన అంశాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్..
. తాజాగా చేరికల కోసం కమిటీని నియమించారు.. ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు పవన్ కళ్యాణ్.
కొద్దిరోజులుగా పార్టీ బలోపేతంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు. వరుసగా జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు