
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లోకీ ఎంటర్ అవ్వడమే కాకుండా.. వీటికి ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యాయి. దీనివల్ల రాబోయే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే, పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో జూన్ 18 నుండి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కుండపోతగా వానలు పడొచ్చని అలర్ట్ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు ఊపందుకున్నాయి. కోస్తాంధ్ర, ఉమ్మడి గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడనున్నాయి. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ అక్కడక్కడ జల్లులు పడతాయి. ప్రస్తుతం మ్యాప్‌లో నైరుతి రుతుపవనాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ముందుకు సాగుతున్నప్పటికీ.. విస్తారంగా కురవాల్సిన వర్షాల తీవ్రత మరో వారం రోజుల పాటు కాస్త స్లోగానే ఉండనుంది.
టెక్నికల్‌గా రుతుపవనాల పురోగతి బాగున్నా, వర్షాలను ఎక్కువ చేసే సిస్టం ప్రస్తుతం కొంచెం వీక్‌గా ఉంది. అందుకే జూన్ 23 వరకు దేశవ్యాప్తంగా పెద్దగా వర్షపాతం ఉండకపోవచ్చు. వెదర్ మోడల్స్ విశ్లేషణ ప్రకారం.. జూన్ 23 తర్వాతే వాతావరణంలో అసలైన మార్పు వస్తుంది.
జూన్ 22 నుండి జూన్ 28 మధ్య ఏపీ-కర్ణాటక సరిహద్దులు, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో వానలు పెరుగుతాయి. ఇక జూన్ 29 నుండి జూలై 5 మధ్య నైరుతి రుతుపవనాలు మళ్లీ పీక్ స్టేజ్‌కి చేరుకుంటాయి. బలమైన
గాలుల వల్ల భారీ వర్షాలు కురుస్తాయి.
అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం రోజులు పడే వానలు ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులకు ఫుల్ బూస్టింగ్ ఇవ్వనున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆల్రెడీ అగ్రికల్చర్ పనులు స్పీడందుకున్నాయి. వానలు పడుతున్న సమయంలో రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉన్నందున ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే, వానలు పడే టైమ్ లో రైతులు చెట్లు, స్తంభాల కింద వుండవద్దని సూచించారు.