
బీచ్‌లు, నైట్ లైఫ్, ఫారెన్ కల్చర్, చారిత్రక ప్రదేశాలు, అడ్వెంచర్లకు ఫేమస్ అయిన గోవాను చుట్టిరావాలనేది చాలామంది కోరిక. అందుకే స్నేహితులు, ఫ్యామిలీతో కలిపి గోవా టూర్ ప్లాన్ చేస్తుంటారు... అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది.
కానీ తెలుగువాళ్లు బడ్జెట్ లో గోవా టూర్ కంప్లీట్ చేసేలా ఐఆర్సీటీసీ (IRCTC) మంచి అవకాశం కల్పిస్తోంది. 'గోవా డిలైట్' పేరుతో ప్రకటించిన ఈ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పక్కా ప్లానింగ్‌తో కూడిన వెకేషన్‌ను అందిస్తుంది.
గోవా ట్రిప్ సెప్టెంబర్ 9న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. ప్రయాణికులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్‌లో గోవా చేరుకుంటారు. తిరుగు ప్రయాణం కూడా విమానంలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ ప్లాన్ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తుంది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోట్ (RGIA) ప్రయాణం ప్రారంభం అవుతుంది. గోవా ఎయిర్పోట్ లో దిగినతర్వాత రోడ్డుమార్గంలో హోటల్ కి చేరుకుంటారు. సాయంత్రం స్థానిక మార్కెట్ లో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి డిన్నర్ హోటల్లోనే ఉంటుంది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత సౌత్ గోవాలోని అందమైన ప్రాంతాలను చూసేందుకు తీసుకెళతారు. ఓల్డ్ గోవా చర్చ్ (బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్, ఆర్కియాలజీ మ్యూజియం ఆండ్ పోర్ట్రేట్ గ్యాలరీ) వ్యాక్స్ వరల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషి టెంపుల్, మిరామర్ బీచ్ సందర్శన ఉంటుంది.
మండోవీ రివర్ లో బోట్ క్రూయిజ్ రైడ్ ఉంటుంది. ఇలా గోవా అందాలను వీక్షిస్తూ రోజంతా ఎంజాయ్ చేసినతర్వాత రాత్రి హోటల్ కి చేరుకుంటారు. డిన్నర్ తర్వాత విశ్రాంతి తీసుకుంటారు. హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసి నార్త్ గోవాను చుట్టివచ్చేందుకు బయలుదేరతారు.
ఫోర్ట్ అగుఅడ సందర్శన ఉంటుంది. కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ అందాలను ఆస్వాదించవచ్చు... వాటర్ గేమ్స్ ఎంజాయ్ చేయవచ్చు. అంజున, వాగటోర్ బీచ్ లతో పాటు చపోరా పోర్ట్ సందర్శన ఉంటుంది. ఇలా సాయంత్రం
వరకు నార్త్ గోవా అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేసి హోటల్ కు చేరుకోవడంతో మూడో రోజు పర్యటన ముగుస్తుంది.
నాలుగోరోజు ఉదయం లేవగానే హోటల్లోనే బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. 10 గంటలకు హోటల్ ను ఖాళీచేసి గోవా విమానాశ్రయానికి చేరుకుంటారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోవడంతో గోవా డిలైట్ టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ నుండి గోవా టూర్ కి వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని బట్టి వేర్వేరు ధరల ఆప్షన్లు ఉన్నాయి. సింగిల్ ఆక్యుపెన్సీ, డబుల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ కోసం వేర్వేరు ధరలు నిర్ణయించారు. విమాన టికెట్లు, ఏసీ హోటల్లో బస, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, లోకల్ ట్రాన్స్పోర్ట్ వంటివి ఈ ప్యాకేజీలో భాగం.
02-04 ఏళ్లకంటే చిన్నవయసు పిల్లలు - రూ.9130
హైదరాబాద్ నుండి గోవాకు విమాన టికెట్లు ఈ ప్యాకేజీలో భాగమే. అలాగే తిరుగు ప్రయాణం గోవా నుండి హైదరాబాద్ ప్లైట్ టికెట్ కూడా IRCTC ఏర్పాటు చేస్తుంది. ఇక గోవాలో 3 రోజులపాటు 4 స్టార్ హోటల్లో ఏసి గదిని కేటాయిస్తారు... బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది. రోడ్డు ప్రయాణం ఏసి వాహనాన్ని అరేంజ్ చేస్తారు... ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఐఆర్సిటిసి ఎస్కార్ట్ సర్వీస్ ఉంటుంది.
అయితే ఏదైనా కారణాలతో విమాన ఛార్జీలు పెరిగితే ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. ఇక హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఎలాంటి ప్రయాణ సదుపాయం ఉండదు... అంటే రానుపోను ఖర్చులు ప్రయాణికులే భరించుకోవాలి. కేవలం ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి డిన్నర్ మాత్రమే ప్యాకేజీలో భాగంగా కల్పిస్తారు... మధ్యాహ్నం లంచ్ ప్రయాణికులే ఏర్పాటుచేసుకోవాలి. మినరల్ వాటర్, మందు ఖర్చులు పర్యాటకులవే.
గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే శ్రమ లేకుండా అన్ని ముఖ్యమైన సౌకర్యాలను ఒకే ప్యాకేజీలో అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. కుటుంబాలు, స్నేహితుల గ్రూపులు, జంటలకు ఇది ఒక మంచి ఎంపిక. ఎలాంటి ఇబ్బంది లేకుండా గోవాను చుట్టిరావాలనుకునే వారికి ఈ ప్యాకేజీ మంచి అవకాశం.
9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా
ఐఆర్సిటిసి విజయవాడ (రైల్వే రిటైరింగ్ రూమ్ సమీపంలో)
ఐఆర్సిటిసి తిరుపతి. ప్లాట్ ఫార్మ్ నంబర్ 1, 1వ అంతస్తు, రిటైరింగ్ రూమ్స్ కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్.