
శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో భారత్-ఏ జట్టు నాటకీయంగా ఓటమి పాలైంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా తీవ్రమైన చర్చలో మునిగిపోయి ఉండగా, బయట మాత్రం డెబ్బై ఏళ్ల ఓ పెద్దాయన ఒకే ఒక్క ఆటగాడి కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారు.
రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో అప్పటికే ప్రేక్షకులంతా వెళ్లిపోయారు. గ్రౌండ్ సిబ్బంది పనులను ముగించే హడావుడిలో ఉండగా, ఓటమి బాధ ఇంకా పచ్చిగా ఉంది. అయినప్పటికీ శ్రీలంక తొలి వన్డే కెప్టెన్, ఆ దేశం ఎంతగానో గౌరవించే క్రికెట్ దిగ్గజం అనుర టెన్నెకూన్ మాత్రం అక్కడే నిల్చున్నారు.ఆయన కొలంబో నుంచి ఇంత దూరం ప్రయాణించి వచ్చింది కేవలం 15 ఏళ్ల భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీని కలవడానికే.
"అతను తరానికి ఒక్కడొచ్చే అద్భుతమైన ప్రతిభావంతుడు" అని టెన్నెకూన్ అభివర్ణించారు. దాదాపు గంటసేపు ఆయన అక్కడే వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అటూ ఇటూ వెళ్తున్నారు. భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మతో కూడా టెన్నెకూన్ కొద్దిసేపు ముచ్చటించారు.
కానీ, ఆయన నిరీక్షణ మాత్రం వైభవ్ కోసమే.ఇక, నిన్న వైభవ్‌కు ఏదీ కలిసిరాలేదు. బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. సూపర్ ఓవర్ తర్వాత జరిగిన వాగ్వాదంతో కూడా అతడిని నిరాశకు గురి చేసింది. సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామన్న తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాడు.
చివరికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వైభవ్, పూర్తిగా నీరసించిపోయి కనిపించాడు. అయితే, ఎదురుగా ఉన్న టెన్నెకూన్ను చూడగానే అతని ముఖంలో మార్పు వచ్చింది. నేరుగా ఆ