
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Thank You Subbarao OTT Streaming on Aha: ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలను థియేట్రికల్‌గా కాకుండా.. ఓటీటీ వేదికగా నిర్మిస్తున్నారు.
అలా తెరకెక్కిన చిత్రాలకు ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చెందు ముద్దు దర్శకత్వంలో వస్తోన్న సరికొత్త చిత్రం ‘థాంక్యూ సుబ్బారావు. ఈ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రాన్ని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ చిత్రంలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు.
తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేయగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లవ్, సస్పెన్స్ కామెడీ, యాక్షన్ థ్రిల్లింగ్ ఇలా అంశాలతో తెరెక్కిన ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించినట్టు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
రైల్లో తెలియని ఓ అమ్మాయి.. ఊరు, పేరు, మొహం కూడా తెలియని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ స్టోరీని సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ సినిమా తెరకెక్కించారని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
సస్పెన్స్, థ్రిల్లింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి ఓ డిఫరెంట్
సబ్జెక్ట్, కంటెంట్ మూవీ జూన్ 18 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్కు రాబోతుంది.
ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు. పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేశారు. డి.వెంకట్ ప్రభు ఎడిటర్‌గా పనిచేశారు. మరి ట్రైలర్లో చూపించినట్టు ఈ సినిమా ఓటీటీ వేదికగా బ్లాక్ బస్టర్ అవుతుందా అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.