
Cricketer Yuzvendra Chahal: స్పోర్ట్స్ స్టార్టప్స్‌కు స్ప్రింట్ఎక్స్ ఒక వేదికగా మారడం అభినందనీయం.టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్. స్పోర్ట్స్, వెల్నెస్, ఫిట్నెస్, టెక్నాలజీ స్టార్టప్స్‌కు స్ప్రింట్ఎక్స్ సంస్థ ఒక మార్గదర్శిగా పని చేయనుందని టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని ఖాజాగూడ ఎస్ఏఎస్ ఐ టవర్స్‌లో జరిగిన స్ప్రింట్ఎక్స్ లాంచ్ కార్యక్రమానికి చాహల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్ స్టార్టప్‌ల కోసం ‘స్ప్రింట్ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని చాహల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా చాహల్ మాట్లాడుతూ టెక్నాలజీ క్రీడల స్వరూపాన్ని మార్చి వేసిందన్నారు. గత ఏడేనిమిది ఏళ్లగా క్రీడలతో టెక్నాలజీ బంధం మరింత పెనవేసుకుపోయిందని చెప్పారు. ఆట ప్రణాళికలు, వ్యూహాలు, సన్నద్ధత మాత్రమే కాకుండా ఫిట్నెస్, వెల్నెస్ పరంగా కూడా టెక్నాలజీ అందిస్తున్న సేవలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని తెలిపారు.
క్రికెట్ విషయానికొస్తే ప్రత్యర్థి బలహీనతలను అంచనా వేయడం, ఏ లెంగ్త్‌లో బంతులు వేయాలి, పిచ్‌పై ఎక్కడ బంతులు వేయకూడదు, బ్యాటర్లను కట్టడి చేయడానికి వంటి సన్నద్ధతకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రాక్టీస్, మ్యాచ్ డే తర్వాత తిరిగి బాడీ రీచార్జ్ అయ్యేందుకు, గాయపడినప్పుడు తిరిగి కోలుకునేందుకు కూడా టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నామని తెలిపారు.
Read Also :IND vs PAK Womens T20 World Cup:దీప్తి శర్మ ‘పంచ్’.. హర్మన్ ‘పవర్’.. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! స్ప్రింట్ఎక్స్, 360డీ స్పోర్ట్స్ వ్యవస్థాపక భాగస్వామి కార్తిక్ యనమండ్ర మాట్లాడుతూ మంచి ఆలోచనలతో ముందుకొచ్చే స్పోర్ట్స్ స్టార్టప్స్‌కు స్ప్రింట్ఎక్స్కు అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు.
యసెస్మెంట్, స్మార్ట్ స్టేడియాల అభివృద్ధి వంటి ప్రాజెక్టులను చేపట్టనున్నామని తెలిపారు. ఎంఎన్సీ సంస్థలతో, తెలంగాణ ప్రభుత్వంతో స్టార్టప్స్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. రూ.25 లక్షల వరకు స్టార్టప్స్‌కు పెట్టుబడి సహకారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి, స్టార్టప్స్ కు మంచి సహకారం అందిస్తున్నారని కొనియాడారు.
స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్ & ఈ-స్పోర్ట్స్, ఫ్యాన్ ఎంగేజ్మెంట్, డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్ఫార్మ్లు, కంటెంట్ & మీడియా టెక్నాలజీలు, డీ2సీ స్ట్రీమింగ్, బ్రాడ్కాస్ట్ & ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీలు వంటి విభాగాల్లో పనిచేస్తున్న స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి 24 వారాల ఈ కార్యక్రమంలో 12 వారాల యాక్సిలరేషన్, 12 వారాల మెంటర్షిప్ అందించబడుతుంది. ప్రతి కోహార్ట్‌లో 10 స్టార్టప్‌లను ఎంపిక చేసి, మార్కెట్ యాక్సెస్, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, పైలట్ ప్రోగ్రామ్‌లు, వ్యాపార విస్తరణ అవకాశాలు, పెట్టుబడుల సన్నద్ధత మరియు ఫండింగ్ కనెక్షన్లు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ జయంత్ యాదవ్, స్ప్రింట్ఎక్స్ మెంటార్ జీఆర్ రెడ్డి, హైదరాబాద్ ఏంజెల్స్ సీఈఓ రత్నాకర్, లెగసీ సంస్థ సహ వ్యవస్థాపకులు మహ్మద్ సిరాజుద్దీన్, అమితేష్, సక్సీడ్ వెంచర్స్ విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.
Pawan Kalyan: జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పవన్.. అమరవీరులకు ఘన నివాళి
Pakistan Aircraft Crash: పాకిస్థాన్ వైమానిక దళంలో విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
LPL : లంక ప్రీమియర్ లీగ్‌కు నాస్డాక్ సంస్థ భారీ ఆర్థిక సాయం
IND vs PAK Womens T20 World Cup:దీప్తి శర్మ ‘పంచ్’.. హర్మన్ ‘పవర్’.. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం!
Bommadevara Dheeraj Archery: ఆర్చరీ స్టార్ ధీరజ్ బొమ్మదేవరపై వైఎస్ జగన్ ప్రశంసలు!
FIH Womens Nations Cup: FIH ఉమెన్స్ హాకీలో అమెరికాపై ఘన విజయం సాధించిన భారత్
Womens T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
Shubman Gill: వన్డేల్లో అత్యంత పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డ్
భారతదేశంలో తొలిసారిగా స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్, రంగాల స్టార్టప్‌ల కోసం స్ప్రింట్ఎక్స్ పేరుతో ప్రత్యేక ఫుల్-స్టాక్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని 360డీ స్పోర్ట్స్, లెగసీ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయని తెలిపారు. అథ్లెట్ ట్రైనింగ్ పెర్ఫామెన్స్, ఏఐ కోచింగ్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, క్రీడాకారుల