
గురు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారి లగ్నంలోకి గురువు ప్రవేశిస్తాడు. దీనివల్ల ఈ రాశి వారికి చాలా ప్రత్యేక ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. ఇక వివాహ జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి. బృహస్పతి సంచారం వల్ల కన్యా రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.
ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. వీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. గురు గ్రహ సంచారం వల్ల ధనుస్సు రాశి వారు డబ్బు పరంగా ప్రయోజనాలను పొందుతారు. ఇతరుల చేతిలో నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది.
అలాగే పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా రాబడి రావచ్చు. జీవితంలో కూడా సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మీకు ఇదే అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్య, విదేశీ ప్రయాణాలతో కూడుకున్న పనులన్నీ విజయవంతం అవుతాయి. ఇక చేస్తున్న పనులలో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రెండు నెలలు వృశ్చిక రాశి వారికి అవకాశాలు పుష్కలంగా వస్తాయి
.