
ఒకప్పుడు మిత్రపక్షంగా కలిసి నడిచిన కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రతిపక్ష ఐక్యత గురించి మాట్లాడే రాహుల్ గాంధీనే దాన్ని దెబ్బతీశారని ఆరోపించింది. డీఎంకే అధికారిక పత్రిక ‘మురసోలి’ సంపాదకీయంతో పాటు పార్టీ ఐటీ విభాగం కూడా రాహుల్‌పై ఘాటు విమర్శలు గుప్పించింది.రాజకీయంగా కష్టకాలంలో కాంగ్రెస్‌ను భుజాన మోసి నిలబెట్టామని, పరిస్థితులు కాస్త మారగానే ఆ పార్టీ తమను వదిలేసిందని డీఎంకే ఐటీ విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
చివర్లో రాహుల్ గాంధీని ‘ఓ పెద్ద జోక్’గా అభివర్ణించింది. ప్రతిపక్షాల ఐక్యత గురించి రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని మురసోలి సంపాదకీయంలో పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో చీలికలకు కారణమైన వ్యక్తే ఇప్పుడు ఐక్యతపై ఉపన్యాసాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించింది.
ముఖ్యంగా కేరళలో వామపక్షాలపై రాహుల్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, మిత్రపక్షాలనే లక్ష్యంగా చేసుకోవడం కాంగ్రెస్‌కు అలవాటైందని ఆరోపించింది.తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను కూడా సంపాదకీయంలో ప్రస్తావించింది. డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో చేరడం వెనుక కాంగ్రెస్ అధిష్ఠానం సమ్మతి ఉందని ఆరోపించింది.
ఇలాంటి చర్యల తర్వాత కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీలకు ఐక్యతపై హామీలు ఇవ్వడం విశ్వసనీయంగా కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.ప్రతిపక్ష కూటమిలో ప్రస్తుతం కనిపిస్తున్న విభేదాలకు ప్రధాన కారణం కాంగ్రెస్ వైఖరేనని మురసోలి ఆరోపించింది. రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వత, స్థిరమైన వ్యూహం లేకపోవడమే ఇండియా కూటమిలో సమస్యలకు దారితీసిందని విమర్శించింది.
అయితే డీఎంకే ఆరోపణలను కాంగ్రెస్