
Nag Ashwin : ప్రభాస్ కల్కి సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. భవిష్యత్తు, పురాణాలకు లింక్ పెడుతూ ఈ సినిమా సరికొత్తగా ఉండటంతో అందర్నీ ఆశ్చర్యపరిచి మెప్పించింది. ఈ సినిమాకు పార్ట్ 2 అధికారికంగానే ప్రకటించడంతో అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే కల్కి 2 సినిమా షూటింగ్ మొదలైంది. ఇటీవలే కమల్ హాసన్ ఉన్న కొన్ని సీన్స్ షూట్ చేసారు. నాగ్ అశ్విన్ ఇటీవల సింగ్ గీతం సినిమాని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడారు.
ఈ సినిమాలో సుమతి పాత్ర నుంచి తప్పుకున్నట్టు దీపికా పదుకోన్ స్వయంగా ప్రకటించింది. అప్పట్లో ఇది పెద్ద చర్చే అయింది. ఆ స్థానంలో ఎవరు నటిస్తారు అని కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. దీనిపై కూడా నాగ్ అశ్విన్ మాట్లాడారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..
దీపిక పదుకోన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ పాత్రకు ఇంకా ఎవరిని అనుకోలేదు. సాయి పల్లవిని మేము ప్రకటించలేదు. సుమతి పాత్ర కచ్చితంగా ఉంటుంది. ఆ పాత్ర లేకపోతే కల్కి పుట్టడు. దీపిక తప్పుకుందని సుమతి కథను, కల్కి కథను మార్చలేము.
కానీ నటిని మారుస్తాము అని తెలిపారు. అలాగే కల్కి 2 షూటింగ్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇంకో రెండు మూడు నెలల్లో లాంగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాము. ఆగస్టు – సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ షూటింగ్ జరుగుతుంది.
విడుదల తేదీ ఇంకా ఫిక్స్ చేయలేదు. షూటింగ్ అయ్యాకే రిలీజ్ గురించి ఆలోచిస్తాము అని తెలిపారు
.