
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా- ఇరాన్ మధ్య శాంతిఒప్పందం కుదిరిన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని అంగీకరించారు.
ఓ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందానికి సంబంధించి ఎదురైన ప్రశ్నకు నెతన్యాహు బదులిస్తూ.. ‘నాకు, ట్రంప్ (Donald Trump)నకు మధ్య కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయి. అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉంది.
ఇరాన్ (Iran)తో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. అది ఆయన నిర్ణయం. మాకు మా సొంత ప్రయోజనాలు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటమే తన లక్ష్యమన్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం అది జరుగుతుందన్నారు.
శాంతిఒప్పందం ఉన్నా.. లేకున్నా ఇరాన్ వద్ద అణ్వాయుధాలు మాత్రం ఉండవని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల్లో ఇరాన్ ఆర్థికవ్యవస్థ పతనమైందని నెతన్యాహు పేర్కొన్నారు. దాని సైనిక పరిశ్రమలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
ఈ నష్టం విలువ వందల బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఘర్షణ ఇంకా ముగియలేదంటూ నెతన్యాహు హెచ్చరికలు చేశారు. ఇరాన్ దాని మిత్రదేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే ఉంటామన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యయానికి అదనంగా 350 బిలియన్ షెకెళ్లను (ఇజ్రాయెల్ కరెన్సీ) కేటాయిస్తున్నట్లు నెతన్యాహు ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో