
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Iran America War End: గత కొన్ని రోజులుగా హార్మూజ్ పై టోల్ వసూల్లు చేసుకోవడానికి తమకు అనుమతులు ఇవ్వాలనే షరతుతో అమెరికాతో ఒప్పందాన్ని కాదన్న ఇరాన్ ఎట్టకేలకు దిగివచ్చింది.
ఒక వేళ ఇరాన్ పెట్టిన షరతులకు అమెరికా ఒప్పుకుంటే ప్రపంచం ముందు ఆ దేశం పరువు బజారున పడేది. ఎట్టకేలకు హర్మూజ్ జలసంధిని ఎలాంటి టోల్ లేకుండా తెరవడానికి అనుమతి ఇస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అదే సమయంలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కూడా వెంటనే ఎత్తివేస్తున్నామన్నారు.
ప్రపంచ దేశాల నౌకలు తమ ప్రయాణాలను ప్రారంభించవచ్చని, చమురు మళ్లీ స్వేచ్ఛగా ప్రవహించనివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు. ఖమేని అంత్యక్రియలకు ముందే శాంతి ఒప్పందం.. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మాత్రం జాగ్రత్తగా స్పందించింది. ప్రస్తుతం కుదిరింది కేవలం అవగాహన ఒప్పందం మాత్రమేనని, అసలు ఒప్పందంపై చర్చలు ఆ తర్వాత అమల్లోకి వచ్చే 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో జరగనున్నాయని క్లారిటీ ఇచ్చింది.
అమెరికాపై తమకు ఇంకా భరోసా లేదంది. ఆ దేశం ఎపుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదన్నారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయోతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక విషయాలు వెల్లడించారు.
డిజిటల్‌గా సంతకాలు చేసేశాయని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనల్ని అమలు చేసిన తర్వాతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఈ డీల్‌పై అధికారికంగా సంతకాలు జరగనున్న నేపథ్యంలో జేడీ వాన్స్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే డిజిటల్‌గా ఒప్పందంపై సంతకాలు చేశామన్నారు. అయినా ఇరాన్‌కు ఎలాంటి నిధులు విడుదల కాలేదన్నారు.
ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆదారపడి ఉంటుందన్నారు JD వాన్స్. ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని తగ్గించుకుంటూ, అణ్యాయుధాల తయారీ జరగకుండా చూసుకోవాలన్నారు. అంతర్జాతీయ పరిశీలనకు అనుమతిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందన్నారు. ఇరాన్ ఒప్పందంలోని షరతుల్ని పూర్తిగా అమలు చేస్తే దాదాపు 300 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ నిధులకు అర్హత పొందే అవకాశం ఉందని చెప్పారు వాన్స్. ఈ నిధులు మాత్రం అమెరికా నుంచి రావని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు గల్ఫ్ దేశాల సహకారంతోనే అందుబాటులోకి ఈ నిధులు రావొచ్చని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రంప్ ఒప్పందం తమకు వర్తించదంటోంది. ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని పట్టుబడుతోంది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ చేసిన ప్రకటన మరోసారి మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల్ని పెంచేలా ఉంది. కాగా జూలై 4న టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా మందిరంలో వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంతిమయాత్రలు సాగనున్నాయి. చివరి అంత్యక్రియలు జూలై 9న మష్హద్లో నిర్వహించి, అదే రోజు ఇమామ్ రిజా పవిత్ర స్థలంలో ఖమేనీకి ఖననం చేయనున్నట్లు ఇరాన్ వర్గాలు వెల్లడించాయి.
యుద్ధం వల్ల హర్మూజ్ జలసంధిలో అనేక చమురు, వాణిజ్య నౌకలు చిక్కుకుపోయాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుని మైన్ల తొలగింపు కార్యకలాపాలు పూర్తైన తర్వాత, పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వందలాది చమురు, గ్యాస్, ఇంధన ఉత్పత్తుల ట్యాంకర్లు ఆసియా ఓడరేవులకు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. తద్వారా సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల నుంచి యుద్ధం వల్ల దెబ్బతిన్న సరఫరా గొలుసును పునరుద్ధరించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి చమురులో పెద్ద భాగం ఆసియా మార్కెట్లకే రానుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ వంటి కీలక ఎగుమతిదారుల నుంచి ఎరువుల సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది. అయితే 100 రోజులకుపైగా సాగిన యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక నష్టాలు ఇప్పట్లో పరిష్కారం కావని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ మార్కెట్లలో మార్చిలో చూసిన 100 డాలర్ల చమురు ధర పూర్తి ప్రభావం అప్పటి నుంచి ఆరు నెలల తర్వాతే పూర్తిగా తెలుస్తుందంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇరు దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై