
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate: మరో నెల రోజుల్లో ఆషాడమాసం ప్రారంభం కానుంది. ఆషాడం వచ్చిందంటే చాలు చాలామంది బంగారం ధర తగ్గుతుందని భావిస్తారు. ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ ముగియడంతో నెల రోజుల పాటు పెళ్ళిళ్ళు కూడా లేకపోవడంతో బంగారం గిరాకీ తగ్గి ధరలు తగ్గుతాయని గతంలో చాలామంది భావించేవారు.
అందుకు తగ్గట్టుగానే బంగారం ధరలు తక్కువగా ఉంటాయని ఆషాడంలో బంగారం షాపింగ్ చేసే వారు కూడా భారీగా ఉంటారు. అటు బంగారం షాపుల యజమానులు కూడా ఆషాడంలో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. మరి ఈసారి కూడా ఆషాడంలో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా వంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జూలై రెండో వారం నుంచి ఆషాడ మాసం ప్రారంభం కానుంది. సాధారణంగా భారతీయ మార్కెట్లలో ఆషాడ మాసంలో పెళ్లిళ్లు గృహప్రవేశాలు వంటివి జరగవు దీంతో బంగారం మార్కెట్ కాస్త డల్ గా ఉంటుంది. ముఖ్యంగా జువెలరీ షాపుల్లో రద్దీ తగ్గిపోతుంది. దీని ప్రభావం బంగారం ధరలపై కూడా పడే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే ఆషాడంలో నగల డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా బంగారం ధర అనేది ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో భారతీయ జ్యువెలరీ మార్కెట్ ప్రభావం బంగారం పైన పెద్దగా పడకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలను ఎక్కువగా అమెరికా ఆర్థిక విధానాలు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు అనేవి ప్రభావితం చేస్తుంటాయి.
ప్రస్తుతం అమెరికా వడ్డీరేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైనట్లయితే ఆషాడంలో బంగారం ధరలు భారీగా
తగ్గే అవకాశం ఉంది.
అయితే ఫిజికల్ రూపంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేవారు, ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుంది. గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 80 శాతం వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఈ నేపథ్యంలో స్వల్పంగా తగ్గినా కూడా కొనుగోలు చేసినప్పుడు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆషాడం తర్వాత శ్రావణమాసం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం అవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారం సేల్స్ అనేవి చేపడితే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం మార్కెట్ ధరలు అనేవి ఆషాడంపై ఆధారపడి కాకుండా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ అంశాల పైన ఆధారపడి పెరగడం లేక తగ్గడం అనేది జరుగుతూ ఉంటాయి కనుక నిరంతరం బంగారం ధరలను పర్యవేక్షిస్తూ ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పెళ్లిళ్లు శుభకార్యాలు వంటి ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఆభరణాలను తక్కువ ధర ఉన్నప్పుడు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి కూడా బంగారం తరహాలోనే సురక్షితమైన పెట్టుబడి మార్గంగా మారిపోయింది. దీంతో బంగారం ధర పెరిగినప్పుడు వెండి ధర కూడా పెరుగుతోంది. అటు బంగారం ధర భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో వెండితో చేసిన ఆభరణాలను సైతం కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో సిల్వర్ జువెలరీ షోరూంలు కూడా పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.