శ్రీవల్లి కడుపు బాగోతంపై ముందు నుంచి నర్మద, ప్రేమలకు అనుమానం ఉండనే ఉంది. అయితే ఆ గుట్టుని బయటపెట్టడంలో భాగంగా.. వేదవతి సాయంతో శ్రీవల్లి ప్రెగ్నెన్సీ బాధ్యతని నర్మద, ప్రేమలు తీసుకున్నారు. ఇక ఈరోజు (జూన్ 16) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే..
శ్రీవల్లి ఆకలి అని అనడంతో పెద్ద ప్లేట్‌కి ముసుగేసి తీసుకుని వస్తారు నర్మద, ప్రేమలు. తన కోసం రకరకాల వంటలు చేసి తీసుకుని వచ్చారని తెగ ఉప్పొంగిపోతుంది శ్రీవల్లి. తీరా ఆ ముసుగు తీసేసరికి అందులో అన్నీ పచ్చి కూరగాయల ముక్కలే ఉంటాయి.
వాటిని చూసి నోరెళ్ల బెడుతుంది శ్రీవల్లి. ఏంటి బల్లక్కాయ్.. సర్ ప్రైజ్ అయ్యావా? షాక్ అయ్యావా? అని అంటారు నర్మద, ప్రేమలు. షాక్ కాదు.. కరెంట్ షాక్ తగిలింది.. అని అంటుంది శ్రీవల్లి. ఆలస్యం ఎందుకు అక్కాయ్ తినూ.. అని అంటారు. ఏంటీ తినేదీ వీటిని గేదెలు కూడా తినవు తెలుసా?
అని అంటుంది శ్రీవల్లి. అందుకే.. నీకు తెచ్చాం అని అంటుంది నర్మద. ‘అంటే ఏంటీ నీ ఉద్దేశం.. అని శ్రీవల్లి అంటే.. ‘ఉద్దేశం లేదూ గిద్దేశం లేదు.. కడుపుతో ఉన్న వాళ్లు పచ్చి కూరగాయలు తింటే.. కడుపులో బిడ్డ చల్లగా ఉంటుంది’ అని అంటుంది నర్మద.అమ్మ బాబోయ్ డాక్టర్..
గొప్ప యాక్టరే ఏంటీ చల్లగా ఉండేదీ.. ఇంత పెద్ద ప్లేట్లో తెస్తే మండీ బిర్యానీ అనుకున్నాను. కానీ.. మీ కడుపులో ఇంత మంటపెట్టుకున్నారని అనుకోలేదు’ అని మండిపడుతుంది శ్రీవల్లి. చూడు బల్లక్కాయ్.. మాకు నువ్వు చేసే వెధవ పనులపై కోపం తప్ప..
నీ కడుపుపై కాదు.. కడుపుతో ఉన్న వాళ్లు పచ్చి కూరగాయలు తింటే మంచిదని డాక్టరమ్మ చెప్పారు.. అందుకే తీసుకొచ్చాం అని అంటారు నర్మద, ప్రేమలు. ఏ డాక్టర్ అమ్మ చెప్పిందీ అని శ్రీవల్లి అంటే.. ఈ డాక్టరమ్మే అంటూ ఫోన్లో ప్రేమ వీడియోనే చూపిస్తారు.
అందులో ప్రేమ డాక్టర్
గెటప్ వేస్తుంది. తినవే.. నోట్లో కుక్కిపారేశారు.. ‘నాకు కడుపురాలేదు బాబోయ్’ పాపం శ్రీవల్లి మాత్రం ప్రేమ కాదనుకుని వాళ్ల మాటల్ని నమ్మేస్తుంది. సరేకానీ తింటావా లేదా?? లేదంటే అత్తయ్యని పిలవమంటావా? అని బెదిరిస్తారు. నేను తినను నాకు వద్దూ అని శ్రీవల్లి ససేమిరా అనడంతో.. ఆ కూరగాయల ముక్కల్ని బలవంతంగా నోట్లో కుక్కేస్తారు నర్మద, ప్రేమలు. వీళ్ల వాయింపుకి దెబ్బకి పైకి లేచి.. ఇక ఆపండీ.. నాకు కడుపులేదూ అని నిజాన్ని కక్కేస్తుంది శ్రీవల్లి. ఆమాట విని నర్మద, ప్రేమలు షేక్ అయ్యి షాక్ అయిపోతారు. ఏంటీ.. నీకు కుడుపులేదా? అని అడుగుతారు నర్మద, ప్రేమలు. అంటే.. ఒకేసారి ఇన్ని కూరగాయలు నా కడుపులో వేస్తే.. ఇంక కడుపు ఎలా ఉంటుంది? ఆ ఉద్దేశంతో అంటున్నా. ఏంటి మాయా.. షాకిచ్చిన ధీరజ్ ఇవి తింటే 9 నెలలో కాదు.. ఇప్పుడే హాస్పిటల్‌కి పోయేట్టుగా ఉన్నాను. ఈ పూటకి ఇది చాలు.. నన్ను వదిలేయండి అని అంటుంది శ్రీవల్లి. సరే అక్కాయ్.. సాయంత్రం మరో స్పెషల్ ఫుడ్ ఐటమ్‌తో కలుద్దాం అని అంటారు నర్మద, ప్రేమలు. ఏంటీ మళ్లీ స్పెషలా? చచ్చిపోతాన్రా దేవుడా అంటూ అక్కడ నుంచి పరుగు తీస్తుంది శ్రీవల్లి. కట్ చేస్తే.. వేదవతి, ప్రేమలు వాకిలి ఊడుస్తూ ఉండగా.. ధీరజ్ సేనాపతిని కారు ఎక్కించుకుని వస్తాడు. సరిగ్గా వాకిట్లో కారు ఆపి.. ‘దిగకుండా అలా గుడ్లెప్పగించి అలా చూస్తావ్ ఏంటీ మాయా.. ఎత్తుకుని దించాలా ఏంటీ.. నేను దించితే మిగిలిన ఎముకలు విరిగిపోగలవు.. దించాలా? అని అంటాడు ధీరజ్. ఉప్పు నిప్పు కలిసి వచ్చారేంటే.. నాన్నకి చేతికి దెబ్బ ఎలా తగిలింద్రా మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త మాయా.. తేడా లొస్తే చేతులే కాదు కాళ్లు కూడా విగిపోవచ్చు అని అంటాడు ధీరజ్. ఆ మాటతో రగిలిపోతుంటాడు సేనాపతి. వాళ్లని చూసిన వేదవతి.. ‘ఏంటీ మామా అల్లుడు కలిసి ఒకే కారులో వచ్చారూ.. వీళ్లు ఉప్పు నిప్పులు కదా.. అని ప్రేమతో అంటే.. నాకూ అలాగే ఉంది అత్తా అంటూ ధీరజ్ దగ్గరకు పరుగుతీస్తుంది. మా నాన్న నీ కారులో రావడం ఏంట్రా?? పిచ్చి షాక్‌లా ఉంది. పైగా మానాన్న చేతికి దెబ్బ కూడా ఉంది. ఏమైంద్రా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్.. మీదంతా కంగారు బ్యాచ్ కదా.. నా కారు పక్క నుంచి వెళ్లేసరికి భయపడి కిందపడి చేయి విరగ్గొట్టుకున్నాడు’ అని అంటాడు ధీరజ్.ఆ ధీరజ్ గాడే చేయి విరగ్గొట్టాడు.. సచ్చినోడా.. మా నాన్న చేయి విరగ్గొడతావా? అని అంటుంది ప్రేమ. మీ నాన్న చేయి విరగడానికి కారణం నేను కాదు.. నువ్వూ.. ఉదయం నువ్వు ఎదురొచ్చి తుమ్మావ్.. పెళ్లం తుమ్మితే మొగుడుకి మంచిదని అన్నావ్ కదా.. కానీ మీ అయ్యకే చేయి విరిగింది.. భలే అయ్యింది అని అంటాడు ధీరజ్. సచ్చినోడా.. మా నాన్న చేయి విరగ్గొట్టిందే కాకుండా.. అది నాపై నెట్టేస్తావా? అంటూ ధీరజ్ని ఉరికించి కొడుతుంది ప్రేమ. ఇక సేనాపతి.. ఆవేశంగా భద్రావతి దగ్గరకు వెళ్తాడు. చేతికి ఉన్న కట్టుని చూసి ఏమైంద్రా అని కంగారు పడిపోతుంది భద్రావతి. ఓ పొగరుబోతు చేసిన పని ఇది.. ఆ ధీరజ్ గాడు కారుతో గుద్దించాడు అని అంటాడు సేనాపతి. వాడు రామరాజు కొడుకు.. పైగా ఉడుకురక్తం ఓ పక్క కొడుకు చేయి విరిగిందంటే ఏ తల్లి అయినా కంగారు పడుతుంది.. కానీ శారదాంబ మాత్రం.. హో నా మనవడే విరిచాడా? వీరుడు రంగలోకి దిగాడు అంటూ గర్వంగా ఫీల్ అవుతుంది ఇదేం విచిత్రమో మరి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అని సేనాపతి రంకెలేస్తాడు. ఎప్పుడూ మీరే వాళ్లని ఏదోటి చేస్తారు.. ఈసారి రివేంజ్ వాడిది. పైగా వాడు రామరాజు కొడుకు.. అందులోనూ ఉడుకు రక్తం.. జాగ్రత్తగా ఉండటం మంచిది అని అంటుంది శారదాంబ. వాడ్ని వదిలే ప్రసక్తే లేదు.. నీకు వచ్చిన నొప్పి బాధ వాడు కూడా అనుభవించాలి. కారు లాక్కుంటే లారీ కొంటాడు.. దానితో గుద్దితే నేరుగా పైకే వాడి పొగరు దించుతాను. మొన్న పోలీస్‌లు వాడి కారుని సీజ్ చేస్తారనుకుంటే బయటపడ్డాడు. ఈసారి వాడికి ఆ ఛాన్స్ లేకుండా చేస్తాను. ధీరజ్‌కి ఫైనాన్స్ ఇచ్చిన వాడ్ని రెచ్చగొట్టి.. ఆ కారు వాడి దగ్గర లేకుండా చేస్తాను’ అని అంటుంది భద్రావతి. రేయ్ ఎందుకురా ఇవన్నీ.. మీరు వాడి దగ్గర కారు లేకుండా చేస్తే.. ఈసారి లారీ కొంటాడు.. అప్పుడు దానితో గుద్దితో విరిగిదేది చేయి కాదు.. ఏకంగా పైకే పోతావ్ అని హెచ్చరిస్తుంది శారదాంబ. అటు చాలా రోజుల తరువాత నర్మద ఆఫీస్‌లో కనిపించిందయ్యో.. తన కొలీగ్ ఒకామె.. వాళ్ల ఆయనపై నిఘా పెట్టి నర్మదకి ఓ వీడియో చూపిస్తుంది. అబద్దాలను కనిపెట్టే మెషీన్.. మీ ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడా? సెలవు రోజుల్లో కూడా డ్యూటీకి వెళ్తున్నాడా? అబద్దాలు చెప్తున్నాడా? మొగుడు గురించి మీకు రహస్యాలు తెలియాలంటే.. ఈ మెషీన్ వాడండీ.. మీ ఆయన చెప్పింది నిజమో అబద్దమూ కనిపెట్టండి.. మీ ఆయన తాట తీయండి’ అంటూ ఆ వీడియోలో ఓ వ్యక్తి చెప్తుంటారు. మా ఆయన చెప్పేది నిజమో అబద్దమూ తెలుసుకోవడం కోసం ఈ మెషీన్ కొంటాను అని తన కొలీగ్ చెప్పడంతో.. నర్మదకి వెంటనే శ్రీవల్లి గుర్తొస్తుంది. ఏంటే మా ఆయన లాగే మీ ఆయన కూడా అబద్దాలు చెప్తున్నాడా? అని ఆమె అడగడంతో.. ‘మా ఆయనకి అంత సీన్ లేదులే కానీ.. మా బల్లక్కాయ్పై ఓ పెద్ద డౌట్ ఉంది. దానికోసమే ఆలోచిస్తున్నా అని అంటుంది నర్మద. డౌట్ అవసరం లేదు.. ఈ మెషీన్‌ని ప్రయోగించావంటే నిజం బయటకు వచ్చేస్తుంది అని అంటుందామె. దాంతో నర్మద.. ఆ మెషీన్‌తో నీ కడుపు బాగోతాన్ని తేల్చేస్తా బల్లక్కాయ్ అని అంటుంది నర్మద.