మహాలక్ష్మీ ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో చక్రి ఇంటికి బయల్దేరుతాడు. మాధవ అన్నయ్య తప్పా ఇంకెవ్వరూ ఫోన్ చేయలేదు..ఏం చేశాడు.. ఎక్కడున్నాడు.. తిన్నాడా? లేడా? పట్టించుకోలేదు.. మిగతా వాళ్లు.. వాళ్ల సంగతి చెప్తా అని చక్రి అనుకుంటూ కారులో వెళ్తుంటాడు.
ఇంతలో ఒకడు బైక్ మీద సడెన్‌గా వస్తాడు. చక్రి కారుకి డ్యాష్ ఇచ్చి కింద పడిపోతాడు. నేనేం తప్పు చేయలేదు.. నువ్వే ఇండికేటర్ వేయలేదు.. నేను హారన్ కొట్టా.. టర్నింగ్ దగ్గర నువ్వే స్పీడుగా వచ్చావ్ అని చక్రి అంటాడు. ఎంత పొగరురా నీ మీద కంప్లైంట్ ఇస్తా అని అవతలి వ్యక్తి అంటాడు.
నాకేం భయం లేదు.. నేనేం తప్పు చేయలేదు అని చక్రి అంటాడు. చికెన్ బిర్యానీ చేసుకుందాం అని మాధవ, కన్నా, కేశవ, మహా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్న బైక్ యాక్సిడెంట్‌ని పెద్ద కేసుగా మార్చేస్తున్నాడు అని చక్రికి ఫోన్ చేసి మాధవకి చెప్తాడు.
సెటిల్మెంట్ అవుతుందని కేశవ డబ్బులు తీసుకుని వస్తారు. అలా అందరూ కలిసి స్టేషన్‌కి వెళ్తారు. ఏయ్.. ఎవరు మీరంతా అని కేశవ, మాధవ, మహాలను చూసి అక్కడి ఎస్సై అడుగుతాడు.కేసు పెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అయితే నేనేం తప్పు చేయలేదు.. అతనే రాంగ్ రూట్లో వచ్చాడు అని చక్రి అంటాడు.
నేనేం రాంగ్ రూట్లో రాలేదు.. పైగా పొగరుగా మాట్లాడాడు.. ఇతడ్ని వదిలి పెట్టొద్దు.. లోపల వేయాలని అవతలి వ్యక్తి అంటాడు. ఇక మేం ఏం చేయలేం.. కేసు పెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అయితే చాలు అని ఎస్సై అంటాడు. అతనికి నష్టపరిహారం వద్దు అంట..
మీరంతా బయటకు వెళ్లండి.. మీ కారు ఓనర్ని ముందు రమ్మనండి.. అని చెప్తారు. దీంతో ఓంకారేశ్వర్కి కానిస్టేబుల్ ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాడు. మహాని వెళ్లమని మాధవ, కేశవ అంటే.. మీరు కష్టంలో ఉంటే ఎలా వదిలేసి వెళ్తాను అని మహా అంటుంది.కంగారు పడకండి..
ఇవన్నీ
మాకు మామూలే మీరేం కంగారు పడకండి అని మాధవ, మహా, కేశవలకు చెప్పి ఓంకారేశ్వర్ చెప్తాడు. ఇక పోలీసులతో, యాక్సిడెంట్ జరిగిన వ్యక్తితో చాలా సేపు మాట్లాడతాడు ఓంకారేశ్వర్. వాళ్లు మాటలతో వినడం లేదు.. కంప్లైంట్ ఇచ్చిన వాడు వాళ్ల వ్యక్తి అని అర్థమైంది.. డబ్బులు ఇచ్చి సెటిల్ చేద్దాం.. కోర్టు చుట్టూ తిరగడం అవసరమా? అని వాడికి చెప్తాం.. వాడికి ఆ ఆలోచన వచ్చేలా చేద్దామని ఓం కారేశ్వర్ మాట తిప్పుతాడు. కోర్టు అంటే ఐదారు ఏళ్లు తిరగాల్సి వస్తుంది.. అని పోలీసుతో, యాక్సిడెంట్ జరిగిన వ్యక్తితో ఓం కారేశ్వర్ అంటాడు.యాభై వేలా.. కాస్త చూడండి.. ఆ మాటలకు పోలీసు, ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి కాస్త కూల్ అవుతారు. సెటిల్మెంట్కి ఒప్పుకుంటారు. పది వేలు ఇస్తానని కారేశ్వర్ అంటాడు. తనని ఇక్కడకు ఎందుకు తీసుకు వచ్చారు అని మహా గురించి కేశవను చక్రి అడుగుతాడు. నీకు ఇంకా పొగరు తగ్గలేదురా.. అదే నిన్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది.. అని కేశవ అంటాడు. ఇంతలో యాభై వేలకు సెటిల్మెంట్కి ఒప్పుకున్నాడని ఎస్సై అంటాడు. యాభై వేలా.. కాస్త చూడండి అని ఓం కారేశ్వర్ అంటాడు. కానీ ఎస్సై ఒప్పుకోడు. యాభై వేలు కావాల్సిందే అని అవతలి వ్యక్తి కూడా భీష్మించుకుని కూర్చుంటాడు.మిగిలిన డబ్బులు నేను కడతాను.. పెద్ది, కేశవ దగ్గర కలిపి 39 వేలే ఉంటాయి.. నా డబ్బులు కూడా తీసుకు వస్తానని అన్నాను.. మీరే వద్దని అన్నారు అంటూ మహా ఫీల్ అవుతంది. ఇంతలో ఓంకారేశ్వర్ వచ్చి మిగిలిన డబ్బులు నేను కడతాను.. వాడు కూడా నాకు తమ్ముడు లాంటి వాడే అని అంటాడు. ఇక డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు. చక్రిని లోపలి నుంచి బయటకు తీసుకుండని మహా అంటుంది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? రౌడీ అనుకుంటున్నావా? అని చక్రిని చూసి ఎస్సై ఫైర్ అవుతాడు. ఆ షర్ట్ బటన్స్ పెట్టు అని బెదిరిస్తాడు. ఓం కారేశ్వర్, మాధవ, కేశవ, మహా ఇలా అందరూ రిక్వెస్ట్ చేయడంతో షర్ట్ బటన్ పెట్టేస్తాడు.నెల వరకు నో డ్రైవింగ్.. ఇకపై కారు జాగ్రత్తగా నడుపు అని ఎస్సై అంటే.. ఆ మాట రాంగ్ రూట్లో వచ్చిన ఈ రాస్కెల్‌కి చెప్పు అని చక్రి పొగరుగా అంటాడు. దీంతో ఎస్సైకి కోపం వస్తుంది. చక్రిని లాగి పెట్టి కొడతాడు. నీ పొగరు తగ్గాలంటే.. ఒక నెల వరకు డ్రైవింగ్ చేయొద్దు.. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వెళ్లు రా అని ఎస్సై అంటాడు. నెల ఖాళీగా ఉంటే పనిష్మెంట్ లా జీవితాంతం గుర్తుకు ఉంటుంది.. ఇంకా అలానే చూస్తున్నావ్ ఏంట్రా.. చచ్చే వరకు డ్రైవింగ్ చేయకుండా చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. వద్దు సర్ అని మాధవ రిక్వెస్ట్ చేస్తాడు. అందరూ కలిసి చక్రిని బయటకు తీసుకు వెళ్తారు.ఇంట్లో ఎగిరినట్టుగా.. అవమానం జరిగింది నాకు.. నేనేం తప్పు చేయలేదు.. మీరు కూడా నా మాట నమ్మడం లేదు.. వాడికి నష్ట పరిహారం ఇచ్చారు.. అని ఇలా మాధవ, కేశవలతో చక్రి అంటాడు. ఇంట్లోనే ఉన్నట్టుగా బయట ఉంటామని కుదరదు, ఇలానే చేస్తే నీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని పోలీసులు చెప్పారు అని కేశవ అంటాడు. మధ్యలో నారాయణ వచ్చి.. ఇంట్లోవాళ్ల మీద లేచినట్టు బయటి వాళ్ల మీద లేస్తే నాలుగు తన్ని పంపిస్తారు అని కౌంటర్ వేస్తాడు. లోపలి నుంచి మహా వచ్చి.. ఎందుకు అలా గట్టి గట్టిగా అరుస్తున్నారు అని అంటుంది. మీరు కూడా నన్నే అంటున్నారా? అని చక్రి ఆగ్రహిస్తాడు.కూల్ చేసిన మహా.. న్యాయం మాత్రమే మన వైపు ఉంటే సరిపోదు.. డబ్బు పరపతి ఉండాలి.. సాక్ష్యాలు ఉండాలి.. ఈ కోపాన్ని ఫ్యామిలీ మీద కాదు పరిస్థితి మీద చూపించాలి.. ముందు రూంలోకి వెళ్లి కాస్త రిలాక్స్ అవ్వు అని చక్రికి మహా చెబుతుంది. అందరి ముందు కొట్టే సరికి వాడు తీసుకోవడం లేదని పెద్ది అంటే.. ఏం చేయలేం కదా మరి అని కేశవ అంటాడు. ఇక చక్రి అయితే ఎస్సై కొట్టిన దెబ్బ, అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ రగలిపోతుంటాడు. తన పర్సులో ఉండాల్సిన డబ్బులు లేవే అని కేశవని కోపంగా అడుగుతాడు చక్రి.కొట్టుకున్న కేశవ, చక్రి.. ఆ డబ్బులు నేను ఓ పని కోసం పెట్టుకున్నా.. నా డబ్బులు నాకివ్వు అని కేశవ, చక్రి గొడవ పడుతుంటారు. జైలుకి వెళ్లకుండా ఆపడానికే ఆ డబ్బులు కట్టామని అంటాడు. వెళ్తే వెళ్లేవాడ్ని అని చక్రి అంటాడు. ఇంతలో నారాయణ వచ్చి.. వెళ్తే అదొక పచ్చబొట్టులా జీవితాంతం, తరాలుగా చెప్పుకుంటారు.. నా పరిస్థితిలా అని నారాయణ అంటాడు. నువ్వు మధ్యలో వచ్చి వేదాంతం చెప్పకు అని చక్రి కసురుకుంటాడు. ఇక కేశవ, చక్రి ఒకరునొకరు గల్లా పట్టుకుని చెంపలు వాయించుకుంటారు. ఈ గొడవని చూసి మహా కిచెన్‌లోంచి ప్లేట్ తీసుకు వచ్చి విసిరేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.