
బెండకాయ అనగానే జిగురుగా ఉంటుందని చాలామంది వద్దంటుంటారు. నిజానికి దీనిలో గుండె ఆరోగ్యానికి, గ్లూకోజు తగ్గటానికి, జీర్ణక్రియ సజావుగా సాగటానికి తోడ్పడే పోషకాలెన్నో ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ అసలే ఉండదు. రోజూ బెండకాయ తినేవారిలో ట్రైగ్లిజరైడ్లు, మొత్తం కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ (చెడ్డ కొవ్వు), రక్తంలో గ్లూకోజు మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు 9 ప్రయోగ పరీక్షల సమీక్ష చెబుతోంది.
అంతేకాదు, హెచ్డీఎల్ (మంచి కొవ్వు) గణనీయంగా పెరుగుతుండటం విశేషం. బెండ.. గుండెకు అండ
|