
ఇంటర్నెట్డెస్క్: రష్యా మిలిటరీలో కీలకమైన బాంబర్ కూలిపోయింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సైబీరియాలోని ఇర్కుట్స్క్లో ఈ ఘటన చోటుచేసుకుంది (Russian Bomber). రష్యా రక్షణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపింది.
ఈ రష్యా బాంబర్.. Tu-22M3 సోవియట్ కాలం నాటిది. ఇది హైపర్సోనిక్ కింజాల్ క్షిపణులను మోసుకెళ్లగలదు. సిరియా, ఉక్రెయిన్లతో జరిపిన సైనిక పోరాటాల్లో రష్యా ఈ బాంబర్లను ఉపయోగించింది. ప్రస్తుతం శిక్షణ కార్యక్రమంలో భాగమైన ఈ విమానం..
కామెంకా గ్రామ సమీపంలో కూలిందని ఇర్కుట్స్క్ గవర్నర్ వెల్లడించారు. ఇంజిన్ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించామని, ప్రమాద సమయంలో అందులో ఎలాంటి యుద్ధ సామగ్రి లేదని రక్షణ శాఖ పేర్కొంది. బాంబర్ అటవీ ప్రాంతంలో కూలిపోతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.