
Today Astrology June 16 Telugu: నేటి రాశి ఫలాలు,, ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 జూన్ 16 మంగళవారం. ప్రత్యేక పండితుల ప్రకారం ఈరోజు రాశుల ఫలాలు ఎలా ఉండబోతున్నాయో, ఏ రాశులు విజయం సాధిస్తాయి?
ఏ రాశులు ఇబ్బందులు ఎదుర్కొంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి రోజు సాధారణంగా సాగుతుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, కాబట్టి ఆది నుంచి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒత్తిడి పెరగవచ్చు, ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది.
కుటుంబంలో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి. వృషభ రాశి వారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, కొత్త పనులు చేపట్టకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోండి. ప్రయాణాలను వాయిదా వేయండి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాటల వల్ల గొడవలు రాకుండా చూసుకోండి. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో వివాదాలకు దిగకుండా ఉండటం ఉత్తమం.
ఆర్థిక నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కన్య రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు, పని చేసే చోట మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి.
ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కలిసివచ్చే రోజు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, అది ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)
దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని